ఇరుముడి మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అయితే ఈ సినిమా రిలీజై ఈనెల 28కి వంద రోజులు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. అదే రోజు రాత్రి అభిమానుల కోసం ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ షోస్‌లో ఇరుముడి పాటలను రెండుసార్లు ప్లే చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి థియేటర్స్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఈ ప్రత్యేక షోలను బాలానగర్‌లోని మైత్రి విమల్, దిల్‌సుఖ్‌నగర్‌లో మైత్రి గంగాలో వేయనున్నారు.
ముఖ్యంగా ఇరుముడి సాంగ్స్ ఆడియన్స్‌కు థియేటర్లలో పూనకాలు తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. తాజాగా మరోసారి ఇరుముడిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ మెప్పించింది. ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
This కార్తీక మాసం, let us relive the magic of #Irumudi on its 100th day ❤🔥 Special shows at Mythri Vimal and Mythri Ganga on 28th November (10:23 PM)✨ The chartbuster songs will be played twice on the big screen to celebrate the landmark ❤🔥 https://t.co/qOneTHWWur
— Mythri Theatres (@MythriTheatre) November 26, 2026


