శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుపమ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఈవెంట్‌లోనూ అనుపమ పాల్గొనకపోవడంతో చిత్రబృందంతో ఆమెకు విభేదాలు వచ్చాయంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.
(ఇదీ చదవండి: సమంత రీఎంట్రీ.. హీరో విశాల్ ఆశలు..!)
అక్కడ ఉండాలని ఎంతో కోరుకున్నా
‘నవంబర్ 27న భోగి విడుదలవుతున్న సమయంలో చిత్రబృందంతో కలిసి ఉండాలని ఎంతో కోరుకున్నా. సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు విడుదల తేదీలో పలుమార్లు మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో నా డేట్స్ కుదరలేదు. చిత్రబృందంతో కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ.. గతంలోనే అంగీకరించిన ఇతర సినిమా కమిట్‌మెంట్ల కారణంగా ఊటీలో ఉండాల్సి వచ్చింది.
నా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించినందుకు భోగి చిత్రబృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో మీతో కలిసి అక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది. నా మనసంతా అక్కడే ఉంది. మీరందరూ థియేటర్లలో భోగి సినిమాను ఎప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అనుపమ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.



