‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’కి ఇంత ఆదరణ అంచనా వేయలేదు: రమేష్ బాబు | Siddu gadi Love Story Success Meet Highlights | Sakshi
Sakshi News home page

‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’కి ఇంత ఆదరణ అంచనా వేయలేదు: రమేష్ బాబు

Nov 29 2026 3:37 PM | Updated on Nov 29 2026 3:51 PM

Siddu gadi Love Story Success Meet Highlights

మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "సిద్ధుగాడి లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "సిద్ధుగాడి లవ్ స్టోరీ" సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ రోజు ఈ చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ - మా మూవీని ఆడియెన్స్ తో పాటు కలిసి థియేటర్స్ లో చూశాను. మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కు అయితే విజిల్స్ కొడుతున్నారు. ఇది నాకు పెద్ద విజయంగా భావిస్తున్నా. నా మొదటి కల సినిమా. అది తీరింది. సినిమా బాగా ఆడుతోంది. ఇంత ఆదరణ ఇస్తారని అంచనా వేయలేదు. ప్రతి సెంటర్ నుంచి మా సినిమాకు మంచి రిపోర్ట్ వస్తోంది. ప్రేక్షకుందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ - మేము మా సినిమాను కష్టపడి రూపొందించాం. మా కష్టానికి తగిన ఫలితాన్నిస్తూ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. మేము ఇంతటి రెస్పాన్స్ ను ఊహించలేదు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. యూత్ ఆడియెన్స్ నేను చేసిన సిద్ధు క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. డ్యాన్స్ , ఫైట్స్ బాగా చేశాననే పేరొస్తోంది. మార్నింగ్ షోస్ కు చాలా మంది వెళ్లారు. ఇప్పుడు ఫస్ట్ షో కు హౌస్ ఫుల్స్ అవుతాయని నమ్ముతున్నాం. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లి చూడండి. సాంగ్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో మదర్ సెంటిమెంట్ బాగుందని అంటున్నారు. మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ శృతి మాట్లాడుతూ - ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాకు ఆదరణ లభిస్తోంది. ప్రతి సెంటర్ నుంచి హిట్ టాక్ వస్తోంది. ఇది యూత్ ఓరియెంటెడ్ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా సినిమాను చూస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూడాలని కోరుతున్నా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement