గోరటి వెంకన్న, బూసం జగన్మోహన్ రెడ్డి, అనుపమ, వీకే నరేశ్, భద్రప్ప గాజుల
– అనుపమ పరమేశ్వరన్
‘‘మా ‘క్రేజీ కల్యాణం’ను ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే షోస్ పెరుగుతున్నాయి... హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. మేం థియేటర్స్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి, హ్యాపీగా అనిపించింది’’ అన్నారు అనుపమ పరమేశ్వరన్. వీకే నరేశ్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’.
గాజుల బద్రప్ప దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రివార్డ్స్‌తో పాటు అవార్డ్స్ కూడా సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘మంచి చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది. మా సినిమా మరింత పికప్ కాబోతోంది’’ అన్నారు బూసం జగన్మోహన్ రెడ్డి.
‘‘క్రేజీ కల్యాణం’ను ప్రతి ఆడపిల్ల ఓన్ చేసుకుంటోంది’’ అని చెప్పారు భద్రప్ప. ‘‘ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఎలాంటి అశ్లీలత, హింస, అసభ్యత లేకుండా చక్కటి ఫ్యామిలీ మూవీ నిర్మించడం జగన్మోహన్ రెడ్డి ప్యాషన్‌ను చూపిస్తోంది’’ అని చెప్పారు గోరటి వెంకన్న. నటీ నటులు నీలప్రియ, గౌరి శంకర్, లక్ష్మి కిరణ్, రైటర్ శ్రీనివాస రవీంద్ర, డీవోపీ శ్యామ్ దూపాటి, ఆర్ట్ డైరెక్టర్ సాయి కదిర మాట్లాడారు.


