breaking news
Crazy Kalyanam
-
అందుకే షోస్ పెరుగుతున్నాయి
‘‘మా ‘క్రేజీ కల్యాణం’ను ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే షోస్ పెరుగుతున్నాయి... హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. మేం థియేటర్స్ విజిట్స్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి, హ్యాపీగా అనిపించింది’’ అన్నారు అనుపమ పరమేశ్వరన్. వీకే నరేశ్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. గాజుల బద్రప్ప దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రివార్డ్స్‌తో పాటు అవార్డ్స్ కూడా సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘మంచి చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందని మా సినిమాతో మరోసారి నిరూపితమైంది. మా సినిమా మరింత పికప్ కాబోతోంది’’ అన్నారు బూసం జగన్మోహన్ రెడ్డి. ‘‘క్రేజీ కల్యాణం’ను ప్రతి ఆడపిల్ల ఓన్ చేసుకుంటోంది’’ అని చెప్పారు భద్రప్ప. ‘‘ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఎలాంటి అశ్లీలత, హింస, అసభ్యత లేకుండా చక్కటి ఫ్యామిలీ మూవీ నిర్మించడం జగన్మోహన్ రెడ్డి ప్యాషన్‌ను చూపిస్తోంది’’ అని చెప్పారు గోరటి వెంకన్న. నటీ నటులు నీలప్రియ, గౌరి శంకర్, లక్ష్మి కిరణ్, రైటర్ శ్రీనివాస రవీంద్ర, డీవోపీ శ్యామ్ దూపాటి, ఆర్ట్ డైరెక్టర్ సాయి కదిర మాట్లాడారు. -
అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఒక్క క్లిక్‌తో నాలుగు సినిమాల రివ్యూస్.. ‘దసరా’ విజేత ఏది?
ఈ దసరాకి టాలీవుడ్లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి డబ్బింగ్ సినిమా అయితే..మిగతా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. విడుదలకు ముందు ప్రతి చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడడంతో బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.మరి ఈ నాలుగు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలేవి? దసరా విజేతగా నిలిచిందెవరు? ఓ లుక్కేద్దాం.ఈ దసరా బరిలో ముందు వచ్చిన సినిమా జైలర్ 2. అక్టోబర్ 15 ఈ రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ దిలీప్ కుమార్ మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఫస్టాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ సాగదీతగా అనిపించింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇక అక్టోబర్ 16న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఆ స్థాయిలో కాదు కానీ ఈ సినిమాకు కూడా డీసెంట్ టాక్ వచ్చింది. కథలో విషయం ఉంది కానీ.. స్లోనెరేషన్, నిడివి ఇబ్బందికరంగా మారింది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇక అక్టోబర్ 16న రిలీజ్ అయిన మరో చిత్రం క్రేజీ కళ్యాణం. సందేశం బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచడంలో మాత్రం దర్శకుడు తడపడ్డాడు. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇక ఈ దసరాకి చివరిగా రిలీజ్ అయిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రం..అక్కడక్కడా బోర్ కొట్టించినా.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, జానపద కళకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేసేలా సాగుతుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి మీద నా అభిప్రాయం అదే!
‘‘క్రేజీ కళ్యాణం’ సినిమా చూసి మా అమ్మ, నాన్న చాలా బాగుందని ప్రశంసించారు. వాళ్లకు తెలుగు భాష రాకున్నా సినిమాలోని భావోద్వేగానికి బాగా కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకులకు మా సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. దసరా పండగ సీజన్లో ఒక క్రేజీ ఫిలిం చూసిన అనుభూతి కలుగుతుంది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. నరేశ్ విజయకృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవు తోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అనుపమ పరమేశ్వరన్ పంచుకున్న విశేషాలు... ⇒ ‘క్రేజీ కళ్యాణం’ కథని భద్రప్ప చెబుతుంటే కొన్నిసార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్‌కు ఎమోషనల్ అయ్యాను. స్క్రిప్ట్‌తో పాటు దర్శకుడిగా భద్రప్ప జెన్యూన్ అ్రపోచ్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ముందు వేరే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ క్రేజీగా అనిపించడంతో మా డైరెక్టర్ ‘క్రేజీ కళ్యాణం’ అని టైటిల్ పెట్టారు. వినోదం, భావోద్వేగాలున్న కథ ఇది. నరేశ్‌గారు, అఖిల్, తరుణ్ భాస్కర్.. ఇలా మేమంతా కాస్టింగ్‌లో జాయిన్ అయ్యాక ఇది మరింత క్రేజీ ్రపాజెక్ట్ అయ్యింది. ⇒ ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ ఇబ్బందులు పడుతుంటాయి. అవి ప్రేక్షకులకు వినోదంగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా సహజమైన వినోదం వస్తుంటుంది. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్లో చాలా వినోదం ఉంటుంది. మా డైరెక్టర్, ప్రోడ్యూసర్ జగన్గార్లు కూడా కొంతవరకు బాలరాజులే (నవ్వుతూ). పెళ్లనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది. కానీ, అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా పాత్ర కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగానూ నా ఒపీనియన్ అదే. ఈ సినిమాలో నాకు పెళ్లి అవుతుందా? లేదా అనేది తెరపై చూడాలి. ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాను. జగన్ మోహన్ రెడ్డిగారిలాంటి క్రేజీ ప్రోడ్యూసర్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు. ⇒ నటిగా నేనెప్పుడూ వెర్సటైల్‌గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. నా పాత్ర చూసి సినిమా పేరు చె΄్పాలి. అంత ప్రత్యేకంగా సినిమాలు ఉండేలా కథలు ఎంచుకుంటాను. ‘క్రేజీ కళ్యాణం’లో నేను చేసిన కీర్తి పాత్ర కూడా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నేనెప్పుడూ డబ్బుల కోసం నటించాలనుకోను. కొత్తగా ప్రయత్నించాలన్నది నాప్యాషన్. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా, తమిళంలో రెండు, మలయాళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. -
‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: క్రేజీ కల్యాణంనటీనటులు:డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులునిర్మాణ సంస్థ: యారో సినిమాస్నిర్మాత: బూసం జగన్ మోహన్ రెడ్డిదర్శకత్వం: బద్రప్ప గాజుల సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటిఎడిటర్: శ్రావణ్ కటికనేనివిడుదల తేది: అక్టోబర్ 16, 2026కథేంటంటే..మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాలరాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. నిత్యం తాగుతూ..ఊర్లో వాళ్ళతో గొడవలు చేసి మామ పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు. కానీ కీర్తి కాలేజీ లో ఉదయ్(అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. బాగా చదువుకొని జాబ్ వచ్చిన తరువాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ లోపు నాన్న పర్వతాలు ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. నాన్న కోరిక మేరకు కీర్తి ఆ అమెరికా సంబంధం ఓకే చేసిందా? లేదా ప్రేమించిన ఉదయ్‌ని పెళ్లి చేసుకుందా? బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలకున్న తన లక్ష్యం నెరవేరిందా? లేదా? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే ఆంక్షలు మొదలవుతాయి. చదువు పూర్తవగానే పెళ్లి చేసి తమ బాధ్యత తీరిపోయిందని భావించే తల్లిదండ్రులు ఎంతోమంది. పైచదువుల కోసం లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వెనకడుగు వేసేవారే.. పెళ్లి విషయానికొచ్చేసరికి లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వడానికి వెనకాడరు. అదే డబ్బులో పదో వంతు అమ్మాయి చదువుపై ఖర్చు చేస్తే.. ఆమె జీవితమే కాదు, కుటుంబ భవిష్యత్తు కూడా మారిపోతుంది. ఆడపిల్ల అంటే బాధ్యత మాత్రమే కాదు.. తల్లిదండ్రుల గర్వాన్ని నిలబెట్టగల సత్తా ఉన్న వ్యక్తి అని చాటిచెప్పే చిత్రమే ఈ క్రేజీ కళ్యాణం. దర్శకుడు బద్రప్ప ఎంచుకున్న పాయింట్ పాతదే కానీ..కానీ తెలంగాణ నేపథ్యంలో ఈ కథను నడిపించడం కొంతవరకు కొత్తదనం తెచ్చిపెట్టింది. సందేశం బాగున్నా..దాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో మాత్రం దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. తాగుబోతు అల్లుడుతో మామ పడే ఇబ్బందుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మొదటి పది నిమిషాలు పాత్రల పరిచయానికే పోతుంది. ఆ తర్వాత నరేశ్, తరుణ్ భాస్కర్ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చిన్న కూతురు పెళ్లి కోసం పర్వతాలు పడే ఆరాటం కామెడీగా చూపిస్తూనే.. మరోవైపు కీర్తి, ఉదయ్‌ల లవ్ట్రాక్ని నడిపించాడు. అయితే ఈ లవ్‌ట్రాక్ రొటీన్‌గానే ఉండడంతో కొంతవరకు బోరింగ్‌గా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ చేసే కామెడీ ఆ మైనస్‌ని పూడ్చుకొచ్చింది. ఓ ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక ద్వితియార్థం కొంతవరకు సీరియస్‌గా సాగుతుంది. ఎమోషనల్ సీన్లు బాగానే ఉంటాయి. అయితే కామెడీ సీన్లు వర్కౌట్ అయినట్లుగా అవి కాలేదు. చివరి అరగంట సినిమా పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నరేశ్ నటన అదిరిపోతుంది. మధ్యలో తరుణ్ భాస్కర్ చేసే యాక్షన్ సీన్ కొంతవరకు నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. రొటీన్ కథే అయినా సందేశం బాగుంటుంది. రెండు భారీ సినిమాల(జైలర్ 2, రణబాలి) మధ్య రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు కొంత మైనస్. సోలోగా వచ్చి ఉంటే..ఫలితం మరింత మెరుగ్గా ఉండేదేమో!ఎవరెలా చేశారంటే..మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలంగాణ గ్రామీణ యువతి కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ చక్కగా నటించింది. తెలంగాణ యాసతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. తెరపై పక్కింటి అమ్మాయిలా అందంగా కనిపించింది. ఇక నరేశ్ అయితే మిడిల్ క్లాస్ నాన్న పర్వతాలు పాత్రలో జీవించేశాడు. అయితే తెలంగాణ యాసలో మాట్లాడడం కొంతవరకు కృతంగా అనిపించింది. బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. కీర్తి బాయ్‌ఫ్రెండ్ ఉదయ్ పాత్రకు అఖిల్ రాజ్ న్యాయం చేశాడు. కీర్తి అక్క పాత్రతో పాటు మిగిలిన వారంతా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'మనుషులకు జ్వరమొచ్చినా బర్రెలకే ప్రయారిటీ'.. డైరెక్టర్ ఎమోషనల్
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా బరాత్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బద్రప్ప గాజుల ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వేదికపైకి పిలిపించి మాట్లాడారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదని అన్నారు. ఏ పని చేయకుండా గాలికి తిరిగానని..నా కోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఈ రోజు వేదికపైకి పిలిచి అమ్మా, బాపును మనస్ఫూర్తిగా హత్తుకోవాలని ఉందని బద్రప్ప భావోద్వేగానికి గురయ్యారు.డైరెక్టర్ బద్రప్ప మాట్లాడుతూ.."నాకొక చిన్న కోరిక ఉందండి. నా చిన్నప్పుడు మా బాపు నన్ను ఎత్తుకుని ఉంటాడు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నాన్నను హగ్ చేసుకోలేదు. మా అమ్మ, నాన్నను వేదికపై హగ్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఏ పని చేయకుండా గాలికి తిరిగాను. నా కోసం చాలా కష్టపడ్డారు. బాపు నేను సినిమా తీసినా. నీ పేరు నిలబెడతా. ఇప్పటికీ పొలంలో పనిచేస్తారు. మా ఇంట్లో మనుషులకు జ్వరం వచ్చినా నాన్న బర్రెలనే పట్టించుకుంటాడు. ఇప్పటి వరకు వీళ్ల సంతోషం కోసం నేను ఏమి చేయలేదు. ఇప్పుడు మీ గురించే సినిమా తీసినా' అంటూ ఎమోషనల్ అయ్యారు. -
‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అమ్మ కోరుకున్నట్లే అనుపమతో కలిసి నటించా: అఖిల్ రాజ్
‘నేనెప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో నటుడిగా భాగం కావాలని కోరుకుంటాను. నా క్యారెక్టర్ నిడివి ఎంత అనేది చూసుకోను. బాగాలేని సినిమాలో మూడు గంటలు కనిపించే కంటే ఓ మంచి సినిమాలో బాగా కుదిరాడు, బాగా నటించాడనే పేరొస్తే చాలు. మార్కెట్, కమర్షియాలిటీ వీటన్నింటి కంటే నాలాంటి నటులను ఒక మంచి సినిమానే ముందుకు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతాను’ అన్నారు యంగ్ హీరో, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్. డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ప్రొడ్యూసర్ జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో విందు భోజనం అనే సినిమా చేశాను. అప్పటి నుంచి ఆ సంస్థతో, వారితో టచ్ లో ఉంటూ వచ్చాను. క్రేజీ కల్యాణం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడు పిచ్ డెక్ లో ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు. అప్పటికి ఇంకా ఈ సినిమా కాస్టింగ్ లోకి ఎవరూ కన్ఫర్మ్ కాలేదు. ఉదయ్ క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అడిగారు. చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నరేష్ , అనుపమ, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ కన్ఫర్మ్ అయ్యారు.→ తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ హిలేరియస్ గా అనిపించింది. నా క్యారెక్టర్ కు ఫన్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయి. నరేష్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ కు ధీటుగా నా క్యారెక్టర్ ను పర్ ఫార్మెన్స్ తో నిలబెట్టాలని అనుకున్నాను. నన్ను ఏం ఆశించి బద్రప్ప అన్న తీసుకున్నాడో గానీ వందశాతం ఉదయ్ గా కనిపించేందుకు ప్రయత్నించాను. రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ కు ముందే ఈ చిత్రంతో నరేష్ గారు, అనుపమ, తరుణ్ భాస్కర్ తో కలిసి నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నా.→ రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. నేను చిన్న రోల్ చేశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో కలిసి నటించు అని మా అమ్మ చెప్పింది. ఆమె కోరుకున్నట్లే అనుపమతో నేను ఈ సినిమాలో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెతో కలిసి నటించడం మొదట్లో భయమేసింది గానీ తను ఇచ్చిన సపోర్ట్ తో హాఫ్ డేలోనే కంఫర్ట్ గా ఫీలయ్యా. ప్రతి సీన్ చేసే ముందు నేను అనుపమ ఎవరెలా చేయాలనేది డిస్కస్ చేసుకునేవాళ్లం. మేము నటీనటులుగా కాకుండా ఆ క్యారెక్టర్స్ లా చూసుకున్నాం. నేను ఏ సినిమా చేసినా వందశాతం ఎఫర్డ్స్ పెడతాను.→ రాజ్ వెడ్స్ రాంబాయిలో రాజు గా ఎంత ఇన్వాల్వ్ అయి నటించానో ఈ సినిమాలో ఉదయ్ పాత్రలోనూ అంతే హోమ్ వర్క్ చేసి పర్ ఫార్మ్ చేశాను. రాజు వెడ్స్ రాంబాయి లాగే ఈ చిత్రంలో కూడా పక్కింటి కుర్రాడిలాగే కనిపిస్తా. డిగ్రీ పూర్తి చేసుకున్న ఉదయ్ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఉదయ్ పాత్రను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఉదయ్ అనే పాత్రలో ఒక ఎనర్జీ ఉంది. అది చాలా బాగుంటుందని నేను నమ్మాను.→ నాకు అనుపమకు మధ్య అలసెంద్రవంక సాంగ్ ఉంటుంది. ఆ పాటను డా.గోరటి వెంకన్న గారు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది తెలంగాణ నేపథ్య, యాసతో సాగే సినిమా అయినా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. కంటెంట్ బాగున్న సినిమా విజయానికి యాస, ప్రాంతం అనే బేధాలు అడ్డురావు. పెళ్లిచూపులు సినిమా తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆదరించారు.→ మనం ఒక లక్ష్యాన్ని నమ్మి కష్టపడి పనిచేస్తే తప్పకుండా రీచ్ అవుతామని నా జర్నీలో తెలుసుకున్నాను. ఈ పండక్కి వచ్చే అన్ని సినిమాలు ఎంజాయ్ చేయండి. మా సినిమాను కూడా థియేటర్స్ కు వెళ్లి చూడండి. మా క్రేజీ కల్యాణం చూస్తూ మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. మా సినిమా ఏ స్టార్ సినిమాకు పోటీ అనుకోవడం లేదు. వాళ్ల సినిమాలు బిర్యానీ అయితే మా సినిమా స్వీట్ లాంటిది. పండక్కి ఎన్ని సినిమాలైనా ఆదరణ పొందుతాయి. నా నెక్ట్స్ మూవీ శనార్తి. శనార్తి రూటెడ్ కోర్ కల్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నా. -
అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం
‘‘క్రేజీ కళ్యాణం’ సినిమా వినోదం, భావోద్వేగాలతో సాగే మంచి కుటుంబ కథా చిత్రం. ఇలాంటి చిత్రాన్ని నిర్మించాలంటే ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కావాలి. ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అయినప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు బూసం జగన్ మోహన్ రెడ్డి. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం ఉంది’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ విజయకృష్ణ, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ విజయకృష్ణ మాట్లాడుతూ–‘‘నిజాయతీగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘సింగీతం, మా ఇంటి బంగారం, ఇరుముడి’ లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. అదే క్రమంలో మా ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో 6 నిమిషాల లెంగ్తీ సీన్‌ని సింగిల్ టేక్‌లో చేశాను. అందుకే ఈ సినిమాలో తొలిసారి నా పేరు ముందు ‘నవరసరాయ’ అనే బిరుదును వాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. -
దసరా మూవీస్.. హైప్ ఎలా ఉంది?
పండగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో సందడి కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దసరా, బతుకమ్మ సీజన్ కావడంతో మార్కెట్లన్నీ కళకళలాడిపోతున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయిపోయాయి. ఈసారి స్టార్ హీరోలు ఓ వైపు పోటీపడుతుండగా.. వీళ్లతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. ఇంతకీ దసరా మూవీస్‌కి హైప్ ఎలా ఉంది? జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)'రణబాలి' విషయానికొస్తే.. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన సినిమా ఇది. ఈ శుక్రవారం(అక్టోబర్ 16) థియేటర్లలోకి రానుంది. రష్మిక ఇదివరకే 'ఛావా' లాంటి పీరియాడిక్ మూవీస్ చేసింది. విజయ్‌కి మాత్రం ఇదే ఫస్ట్ టైం. లుక్స్ దగ్గర నుంచి ప్రమోషనల్ కంటెంట్ వరకు అన్నీ బాగున్నాయి. హైప్ కూడా పర్లేదనిపించేలా ఉంది. బ్రిటీషర్లపై తిరుగుబాటు తరహా కాన్సెప్ట్‌లతో గతంలో పలు మూవీస్ వచ్చినప్పటికీ ఇది రియల్ ప్లస్ కాస్త ఫిక్షన్ జోడించిన కథ కావడంతో సగటు సినీ ప్రేక్షకులకు కాస్తంత ఆసక్తి ఉంది. మరి దాన్ని 'రణబాలి' టీమ్ ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?'జైలర్ 2' విషయానికొస్తే.. మూడేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్ ఎంతలా సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రకంగా ఇది రజనీకి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. రజనీ పని ఇక అయిపోయిందనుకుంటున్న టైంలో ఇదొచ్చి ఆయన మళ్లీ ఊపిరి తీసుకునేలా చేసింది. చెప్పాలంటే తొలి భాగంలోనే పెద్దగా కథ ఉండదు. రజనీకి పడిన ఎలివేషన్లు, అనిరుధ్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి. మరి ఈ గురువారం(అక్టోబర్ 15) రాబోతున్న రెండో భాగంలో కొత్తగా ఏం చూపించారు? ఈసారి అనిరుధ్ మ్యూజిక్ ఏ మేరకు వర్కౌట్ అయిందనేది చూడాలి. దీనిపై కూడా బజ్ ఓ మాదిరిగానే ఉంది.పైన చెప్పిన సినిమాలపై కాస్తోకూస్తో బజ్ ఉండగా.. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'క్రేజీ కళ్యాణం'(అక్టోబర్ 16), ఆనంది 'గరివిడి లక్ష్మి ' కూడా ఈ వీకెండ్లోనే రిలీజ్ కానున్నాయి. కానీ వీటిపై కనీసం హైప్ లేదు. చెప్పాలంటే వీటి గురించే జనాలకు పెద్దగా తెలీదు! అయితే పండగ టైంలో కొన్నిసార్లు చిన్న చిత్రాలు కూడా కంటెంట్‌తో షాకిస్తుంటాయి. అలా ఈసారి విజయ్ దేవరకొండ, రజనీకాంత్‌లకి చిన్న సినిమాలు ఏమైనా ఝలక్ ఇస్తాయేమో చూడాలి? ఈసారి పండగ విన్నర్ ఎవరనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.(ఇదీ చదవండి: డిజాస్టర్ దర్శకుడితో యష్ కొత్త సినిమా?) -
పెళ్లిపై అనుపమ షాకింగ్ కామెంట్స్
అనుపమా పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన నరేష్ నేటితరం పెళ్లిళ్లు, బంధాలపై తనదైన శైలిలో స్పందించారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చెసుకోకపోయినా..‘ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్లు కావడం లేదు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం పెళ్లి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఆ తర్వాత విడాకుల కోసం మళ్లీ కోర్టుల చుట్టూ తిరుగుతూ అంతే డబ్బు ఖర్ఛు చేస్తున్నారు. ఇప్పుడు సహజీవనం కూడా చట్టబద్ధం అయిపోయింది. అందుకే కనీసం పెళ్లి చెసుకోకపోయినా పిల్లలు అయినా కనండి’ అని యువతని ఉద్దేశించి మాట్లాడారు.ఇదే ప్రశ్నను అనుపామ పరమేశ్వరన్ ని అడగ్గా.. ‘ మీ పెళ్లి అయ్యి రెండు నెలలే అవుతుంది కదా. అందుకే ఇంత క్యూరియాసిటీ ఉంది. ముందు మీ పెళ్లి లైఫ్ ఎలా ఉందో చెప్పండి. మీరే చెప్పండి..పెళ్లి చేసుకోవాలా వద్దా? అని అనుపమ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు)“పెళ్లిళ్లు చేసుకున్నా, చేసుకోకపోయినా పర్లేదు… పిల్లల్ని అయితే కనండి!” – Navarasa Raya Naresh | #CrazyKalyanam https://t.co/pMwUZf1ho6— cinee worldd (@Cinee_Worldd) October 11, 2026 -
పెళ్లిళ్లు చేసుకోకపోయినా పర్లేదు… పిల్లల్ని మాత్రం కనండి: వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. పెళ్లి చుట్టూ సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన వీకే నరేశ్ పెళ్లిళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం? రైట్ ఆర్ రాంగ్ అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. దీనికి స్పందిస్తూ.. పెళ్లి చేసుకున్నా.. లేకపోయినా కరెక్టే ఇప్పుడు అని చెప్పారు. ఈ రోజుల్లో లివింగ్ టుగెదర్ కూడా కరెక్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు అనేది ఒక ఈవెంట్‌గా మారిపోయిందని.. ఆ తర్వాత డివోర్స్ కోసం కోట్ల రూపాయలు తగలెస్తున్నారని అన్నారు.మన రూరల్ సోసైటీలో పెళ్లిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కానీ ఎవరికీ అవ్వడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అయితే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా ఫర్వాలేదండి.. పిల్లల్ని మాత్రం కనండి అంటూ వీకే నరేశ్ సలహా ఇచ్చారు. “పెళ్లిళ్లు చేసుకున్నా, చేసుకోకపోయినా పర్లేదు… పిల్లల్ని అయితే కనండి!” – Navarasa Raya Naresh | #CrazyKalyanam https://t.co/pMwUZf1ho6— cinee worldd (@Cinee_Worldd) October 11, 2026 -
‘క్రేజీ కళ్యాణం’ సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
ముందుగానే కల్యాణం
అనుకున్న సమయానికన్నా కాస్త ముందుగానే ‘క్రేజీ కల్యాణం’ సినిమా థియేటర్స్‌కు రానుంది. అనుపమా పరమేశ్వరన్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు.ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు. అయితే ఈ నెల 16నే రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘‘యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు నిర్మాత. -
కాకా ధూమ్ ధమాకా...
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, వీకే నరేశ్, అఖిల్ ఉడ్డెమారి నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా, లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు, ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు...’ అంటూ ఈ పాట సాగుతుంది. -
తెలంగాణ అమ్మాయిగా అనుపమ.. నవ్వులు పూయిస్తున్న టీజర్
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. పెళ్లి చుట్టూ సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది.‘చెప్పు తల్లి ఎలా చేయాలి నీ పెళ్లి? ఎంత బంగారం కావాలి? ఎన్ని చీరలు కావాలన్నా కొనుక్కో.. నీ దోస్తులందరినీ పిలుచుకో.. జోరుగా చేస్తా నీ పెళ్లి’ అని నరేశ్ చెప్పె డైలాగుతో టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ.. మధ్యలో . మధ్యలో తరుణ్ భాస్కర్ మాస్ ఎంట్రీ, అఖిల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఏం ఫ్యామిలీ రా నాయనా.. బ్రతకనివ్వరు.. చావనివ్వరు’ అంటూ తరుణ్ భాస్కర్ కొట్టే డైలాగ్ ఆకట్టుకుంది.


