పెళ్లిళ్లు చేసుకోకపోయినా పర్లేదు… ఆ ఒక్క పని చేయండి: వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ | tollywood actor VK Naresh Comments about now days marriages | Sakshi
Sakshi News home page

VK Naresh: పెళ్లిళ్లు చేసుకోకపోయినా పర్లేదు… పిల్లల్ని మాత్రం కనండి!

Oct 12 2026 7:30 AM | Updated on Oct 12 2026 8:25 AM

tollywood actor VK Naresh Comments about now days marriages

అనుపమ పరమేశ్వరన్,  తరుణ్ భాస్కర్ , అఖిల్‌ రాజ్‌, నరేష్ వీకే  కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు మేకర్స్‌. పెళ్లి చుట్టూ సాగే ఈ వినోదాత్మక చిత్రంలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన వీకే నరేశ్ పెళ్లిళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం? రైట్ ఆర్ రాంగ్ అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. దీనికి స్పందిస్తూ.. పెళ్లి చేసుకున్నా.. లేకపోయినా కరెక్టే ఇ‍ప్పుడు అని చెప్పారు. ఈ రోజుల్లో లివింగ్ టుగెదర్ కూడా కరెక్ట్‌ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు అనేది ఒక ఈవెంట్‌గా మారిపోయిందని.. ఆ తర్వాత డివోర్స్ కోసం కోట్ల రూపాయలు తగలెస్తున్నారని అన్నారు.

మన రూరల్ సోసైటీలో పెళ్లిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కానీ ఎవరికీ అవ్వడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అయితే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా ఫర్వాలేదండి.. పిల్లల్ని మాత్రం కనండి అంటూ వీకే నరేశ్ సలహా ఇచ్చారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement