శ్రీవిష్ణు కామ్రేడ్ కల్యాణ్.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్..! | Sree Vishnu Starrer Comrade Kalyan Movie 2 Days Box Office Collections Crossed ₹10 Crore, Check Out Latest Numbers Inside | Sakshi
Sakshi News home page

Comrade Kalyan Collections: కామ్రేడ్ కల్యాణ్ మూవీ.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్..!

Oct 11 2026 1:35 PM | Updated on Oct 11 2026 1:56 PM

Sree Vishnu Comrade Kalyan Collections In Just Two days

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ చిత్రంలో మహిమ నంబియార్ హీరోయిన్ నటించింది. ఈ సినిమాకు జానకీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ.. వసూళ్లపరంగా రాణించింది. మొదటిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు వెల్లడించారు.

అయితే రెండో రోజు ఈ చిత్రం వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఫస్ట్ డే కేవలం రూ.4.5 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ మూవీ.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్ సాధించింది. శనివారం ఒక్కరోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

కామ్రేడ్ కల్యాణ్ కథేంటంటే..

'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికొస్తే 90వ ద‌శ‌కంలోని ఆంధ్రా ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతం. ఓ మాదిరిగా చ‌దువుకున్న తాడికొండ కళ్యాణ్‌ (శ్రీవిష్ణు).. ఊరిలో ఓ థియేట‌ర్‌ని లీజుకు తీసుకుని న‌డిపిస్తుంటాడు. అప్పుడే అక్క‌డి అడ‌వుల్లో న‌క్స‌లైట్ ద‌ళాల ఏరివేత కోస‌మ‌ని ప్ర‌త్యేకంగా ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మాస్టార్ (సాయిచంద్‌) దళానికీ, జార్జ్‌కుట్టీకి మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతుండ‌గానే, ఆ ఊరిలోకి ఒరియా అమ్మాయి సితార‌దేవి (మ‌హిమా నంబియార్‌) త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వ‌స్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న త‌న త‌ల్లి స‌ర‌స్వ‌త‌మ్మ (రాధికా శ‌ర‌త్‌కుమార్‌)ని కాపాడిన సితార‌ని చూసి తొలి చూపులోనే కళ్యాణ్‌ ప్రేమ‌లో ప‌డతాడు. ఆమెతో క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకుంటాడు.

సితార కోసం చేసిన కొన్ని పనుల వల్ల థియేట‌ర్‌ని న‌డిపే కళ్యాణ్‌.. కామ్రేడ్ కళ్యాణ్‌ అవుతాడు. పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతాడు. అడ‌విలోని అన్న‌ల‌కు, కళ్యాణ్‌కు సంబంధమేంటి?  త‌న ప్రేయ‌సి సితార కుటుంబాన్ని క‌ష్టాల నుంచి గట్టెక్కించాడా? సితార కుటుంబం క‌ష్టాల్లో కూరుకుపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అనేది మిగతా స్టోరీ. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement