బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన లేటేస్ట్ కోలీవుడ్ మూవీ హలో కాదల్. తెలుగులో ఈ చిత్రాన్ని హలో ప్రేమ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటించగా.. నిఖిలా విమల్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు మలయాళ డైరెక్టర్ నిఖిల్ మురళి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.
(ఇది చదవండి: ఓటీటీకి గరివిడి లక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
ఈ నేపథ్యంలోనే హలో ప్రేమ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.


