ఈ వారం ఓటీటీలకు పలు సూపర్ హిట్ చిత్రాలు రానున్నాయి. టాలీవుడ్‌లో వెంకీ ఆదర్శకుటుంబం, బాలీవుడ్ నుంచి దృశ్యం-3 సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిత్రం సడన్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.
కన్నడలో తెరకెక్కించిన మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ స్పార్క్. ఈ ఏడాది సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు డి. మహంతేశ హండ్రాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నిరంజన్ సుధీంద్ర, రచన ఇందర్, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఒక పెద్ద బ్యాంక్ కుంభకోణాన్ని ఛేదించే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారిని ఎలా కనిపెట్టారనేదే ఈ స్పార్క్ స్టోరీ. తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతమందించారు.
#Spark (Kannada) Now streaming on PrimeVideo 🍿!! #OTT_Trackers https://t.co/fpEi2e0SCU
— OTT Trackers (@OTT_Trackers) November 25, 2026


