'ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా?'.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్ | Bigg Boss Buddy up tasks In House in season 10 telugu | Sakshi
Sakshi News home page

Bigg Boss Season 10: 'ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా?'.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్

Nov 25 2026 7:25 AM | Updated on Nov 25 2026 7:25 AM

Bigg Boss Buddy up tasks In House in season 10 telugu

బిగ్ బాస్ సీజన్ 10 మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా నాలుగు వారాలే సమయం ఉన్నందున కొత్త కొత్త టాస్కులు, థీమ్‌లతో అలరిస్తున్నారు. గతవారం డిక్టేటర్స్‌గా మాజీ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకొచ్చిన బిగ్‌బాస్.. ఈ వారానికి బడ్డీ అప్‌ అని పేరు పెట్టారు. అలా బడ్డీ అప్ థీమ్‌లో భాగంగా ఈ వారం కూడా ఇంట్లోకి మాజీ కంటెస్టెంట్లు వచ్చారు. వారితో కలిసి కెప్టెన్సీ కంటెండర్లు అయ్యేందుకు ఇంటి సభ్యులు గేమ్స్ ఆడారు.

హౌస్‌లోకి ఫస్ట్ ఇమ్మానియేల్, సంజన వస్తే.. ఇమ్ము -ఆర్కే, సంజన- త్రిగుణ్ కలిసి ఆడారు. అందులో ఇమ్ము ఆర్కే విన్ అయ్యారు. ఆ తర్వాత దివ్య, కల్యాణ్ పడాల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరిలో రామ్ ప్రసాద్, దివ్య ఒకవైపు.. శివ, కల్యాణ్ ఓ టీమ్‌గా గేమ్ ఆడారు. ఇందులో కళ్యాణ్, శివ గెలిచారు.

అయితే ఈ వారం నామినేషన్స్‌లో సుధీర్ లేకపోవడంపై హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఎంత కొట్టినా చావని పామువిరా డైరెక్ట్‌గా 13వ వారంలోకి వచ్చావ్ అని అందరూ ఏడ్పించారు.  ఆ తర్వాత ఇమ్మానియేల్, సంజనా ఎంట్రీ ఇస్తారు.   ఆ తర్వాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఇమ్ము- ఆర్కే.. సంజన- త్రిగుణ్‌ పెయిర్ అప్ అయి ఆట ఆడతారు.  ఈ టాస్కులో  ఆర్కే అంతా ఆగమాగం చేస్తుంటాడు. అంతేకాకుండా ఈ టాస్క్ మధ్యలో ముకేష్, అమన్‌కి గొడవ జరుగుతుంది.  చివరకు త్రిగుణ్, సంజనా ఈ టాస్క్‌లో ఓడిపోతారు.

వీరిద్దరి వెళ్లిపోయాక కల్యాణ్ పడాల, దివ్య హౌస్‌లో అడుగుపెడతారు. వీరిద్దరిలో రామ్ ప్రసాద్, దివ్య ఒకవైపు.. శివ, కల్యాణ్ జంటగా గేమ్ ఆఫ్ ఎయిమ్ ‍అనే గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో ముందుగా ఇటుకల్ని తీసుకు వచ్చి ఒక చోట పేర్చి బాల్స్‌ని సంపాదించుకోవాలి. ఆ బాల్స్‌తో అవతల గోడ మీదున్న ఫ్రేమ్స్‌ని పగలగొట్టాలి. ఎవరైతే ఎక్కువ ఫోటో ఫ్రేములను పగలగొడతారో వాళ్లే విన్ అని బిగ్‌బాస్ చెప్తాడు.  ఈ టాస్క్‌లో కల్యాణ్ పడాల అన్‌ ఎథికల్‌గా ఆడుతున్నారని దివ్య అంటుంది. అప్పుడే దివ్య, ముకేశ్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. మీరు సంచాలక్‌గా కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని ముకేశ్‌ను దివ్య అడిగింది. నువ్వు గెస్ట్‌లా బిహేవ్ చేయ్ అని ముకేశ్ అనడంతో.. ఇదే నీ ఇల్లు కాదంటూ దివ్య సైతం ఇచ్చిపడేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement