టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు ఉన్నారు. కానీ పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది మూవీ తర్వాత చాన్నాళ్ల పాటు దర్శకత్వం పక్కనబెట్టిన ఇతడు.. నటుడిగా చాలా మూవీస్ చేశాడు. మూడేళ్ల క్రితం 'కీడా కోలా' అనే చిత్రం తీస్తే ఓకే ఓకే అనిపించుకుంది. కానీ లేటెస్ట్‌గా వచ్చిన 'ఈఎన్ఈ రిపీట్' హిట్ టాక్ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ)
అయితే తరుణ్ ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీస్తే అవన్నీ క్లాస్ కాన్సెప్ట్‌లే. దీంతో యువత మాత్రమే వీటికి కనెక్ట్ అయ్యారు తప్పితే ప్రేక్షకుల్లో చాలామందికి ఈ దర్శకుడి గురించి తెలీదు. మరి ఏమైందో ఏమో గానీ 'ఈఎన్ఈ రిపీట్' మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటినుంచి డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తి లేదని చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
'డబ్బు శాశ్వతం కాదని ప్రతి సినిమాలో నేను చెప్పాను. కానీ ఇప్పటి నుంచి డబ్బునే ఫాలో అవుతా. ఎందుకంటే అందరూ లైనులో నిలబడాలి. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పటినుండి నేను డ్యూటీ ఎక్కుతున్నా దిగే ప్రసక్తే లేదు. ఏ, బీ, సీ అన్నీ కొడతా నా వాయిస్ ఏంటో చూపిస్తా. బయట తప్పు జరిగితే... సినిమాలో కరెక్ట్ చేస్తా. నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నా కులం ఏంటి? నా మతం ఏంటి? ఇవేవీ చూడకుండా, మారేడ్‌పల్లిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని ఆంధ్రాలో, తెలంగాణలో ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది పూర్తిగా సినిమాపై ఉన్న ప్రేమ వల్లే' అని అన్నాడు.
తరుణ్ ఆవేశం చూస్తుంటే ఇకపై క్లాస్ సినిమాలు కాకుండా కమర్షియల్ మూవీస్ మాత్రమే చేస్తానన్నట్లు ఉంది. మరి యుత్‌ఫుల్ దర్శకుడిగా పేరున్న ఇతడు.. కమర్షియల్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతాడు? నెక్స్ట్ ఎలాంటి చిత్రాలు తీస్తాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే: విశ్వక్ సేన్)


