‘ఫూలే’ ఓ విభిన్నమైన జానర్‌’ | phule movie arrive november 27 | Sakshi
Sakshi News home page

‘ఫూలే’ ఓ విభిన్నమైన జానర్‌’

Nov 24 2026 9:23 PM | Updated on Nov 24 2026 9:26 PM

phule movie arrive november 27

జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాల  ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా.పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ  నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో చిత్ర  యూనిట్   ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ‘ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

(ఇదీ చదవండి: ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement