అమెరికన్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి రావడం ఊహించిన పరిణామమే అయినప్పటికీ ఒకింత ఆశ్చర్యకర పరిణామంగా మారింది. ఆయన్ని వెనక్కి తీసుకోవాలన్న ఉద్యోగుల డిమాండ్స్, ససేమిరా అంటూ కొత్త సీఈఓ అన్వేషణలో తలమునకలైంది బోర్డు. ఇలాంటి పరిణామాల మధ్య ఎన్విడియా హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.దీనిపై ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ స్పందించిన తీరు నెట్టింట ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ మార్కెట్ల చరిత్రలో "అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకటి" అని అభివర్ణించిన ఉదయ్ కోటక్ ప్రపంచ ఆధిపత్య పోరు (global power play) విషయంలో నియమాలు ఎంత సులభంగా మారిపోతాయో ఈ నిర్ణయం చూపిస్తోందన్నారు. శక్తివంతమైన వారు తమ పరిసరాలపై ఆధిపత్యం చెలాయించి, చిన్న శక్తులను పక్కకు తప్పుకునేలా చేస్తారు అన్నట్టుగా "ఏనుగులు నాట్యం చేస్తున్నప్పుడు, అందరూ పక్కకు తప్పుకుని దారిస్తారు" అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
Jensen Huang coming back as NVIDIA CEO, is one of the most consequential decisions in the history of world markets. 1 trn $ of Nvidia market cap, 4 trn $ US market cap recovered, with a clear political and economic agenda of keeping the US ahead in the AI race. A message right or wrong, that for global power play, the rules of the game are flexible. When elephants dance, everyone moves to give space!
— Uday Kotak (@udaykotak) November 24, 2026
కృత్రిమ మేధస్సు (AI) పోటీలో అమెరికాను ముందంజలో ఉంచడానికి ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన ఆర్థిక, రాజకీయ ఎజెండా ఉందని అభిప్రాయపడ్డారు. హువాంగ్ రాకతో ఎన్విడియా మార్కెట్ విలువతో పాటు మొత్తం అమెరికా మార్కెట్ కూడా కోలుకుందని కోటక్ పేర్కొన్నారు. కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నియమాలు ఎంత వేగంగా మారతాయో ఇది నిరూపిస్తోందని, "తప్పో ఒప్పో.. ప్రపంచ ఆధిపత్య పోరులో నియమాలెప్పుడూ సరళంగానే (flexible) ఉంటాయనే సందేశం వెళ్లిందన్నారు.
జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓగా తిరిగి రావడంతో ఎన్విడియా షేర్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్లు, అమెరికా మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్లు తిరిగి పుంజుకున్నాయి. సోమవారం నాస్‌డాక్‌లో ఎన్విడియా షేర్లు 31.48 శాతం లాభపడ్డాయి. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువకు ఒకే రోజులో 952 బిలియన్ డాలర్లకు పైగా అదనంగా చేరింది. గత వారం జరిగిన పతనంలో సగానికి పైగా కోలుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఇదీ చదవండి: రూ. 13 లక్షల కారు కోసం రచ్చ, పెళ్లి రద్దు : ట్విస్ట్ అదిరింది!
ఇదీ చదవండి : 24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్


