జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ తుంటరి పోస్ట్! | Jensen Huang Re Entry Donald Trump AI Post Viral | Sakshi
Sakshi News home page

Jensen Huang Trump: ఏఐ ఫొటోతో ట్రంప్.. పోస్ట్ వైరల్

Nov 24 2026 4:45 AM | Updated on Nov 24 2026 4:45 AM

Jensen Huang Re Entry Donald Trump AI Post Viral

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ తిరిగి సీఈఓగా ఎన్నికైన సందర్భంగా ట్రంప్ తుంటరి పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2024 జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే తీసిన ఐకానిక్ ఫొటోని ఆధారంగా చేసుకుని ఈ మీమ్‌ రూపొందించారు. అసలు ఫొటోలోని ట్రంప్ స్థానంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ని ఉంచారు. ముఖంపై రక్తపు మరకలు, చుట్టూ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది యాధావిధిగా ఉండేలా రీక్రియేట్ చేశారు. ట్రంప్ అసలు ఫొటోలో పిడికిలి బిగించి పైకెత్తిన చోట.. హువాంగ్ చేతిలో ఎరుపు రంగు బ్రాని ఉంచారు. వెనుక అమెరికా జెండా స్థానంలో ఎన్విడియా లోగోతో ఉన్న జెండాను చూపించారు. ఈ ఫన్నీ చిత్రాన్ని షేర్ చేసిన ట్రంప్.. ఎలాంటి క్యాప్షన్ జోడించలేదు.

అయితే ట్రంప్.. ఈ ఫొటో పోస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందు ఎన్విడియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పదవి నుంచి వైదొలిగిన జెన్సన్ హువాంగ్‌నే తిరిగి కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ, డైరెక్టర్‌గా నియమించింది. హువాంగ్‌తో చర్చలు జరిపిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై ట్రంప్ గతంలోనే సానుకూలంగా స్పందించారు. ఎన్విడియాతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు హువాంగ్ కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని మరో ట్రూత్ సోషల్ పోస్టులో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement