Jensen Huang: ఒక్కసారిగా ఎగిసిన ఎన్విడియా షేర్లు! | NVIDIA shares jump 30pc within minutes of Huang return as CEO | Sakshi
Sakshi News home page

Jensen Huang: ఒక్కసారిగా ఎగిసిన ఎన్విడియా షేర్లు!

Nov 23 2026 9:02 PM | Updated on Nov 23 2026 9:08 PM

NVIDIA shares jump 30pc within minutes of Huang return as CEO

ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నవంబర్ 12న సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్‌ (Jensen Huang)ను కంపెనీ బోర్డు తిరిగి అదే బాధ్యతల్లో నియమించింది. నవంబర్ 23న ఈ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు భారీగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఏకంగా 30 శాతానికి పైగా లాభపడ్డాయి.

హువాంగ్‌పై వ్యక్తిగత సంబంధాలు, చైనా గూఢచర్య ఆరోపణలకు సంబంధించిన వార్తలు వెలువడటంతో కంపెనీలో సంక్షోభం మొదలైంది. దీంతో ఆయన నవంబర్ 12న పదవి నుంచి తప్పుకోగా, సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు చర్చలు, సమావేశాలు నిర్వహించిన బోర్డు.. హువాంగ్ నాయకత్వ సామర్థ్యం, వివరణలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఆయన పునర్నియామకానికి ఆమోదం తెలిపింది.

అమెరికా ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామని, హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు లేదని బోర్డు పేర్కొంది. అయితే ఆయనపై జరుగుతున్న అంతర్గత విచారణ ఇంకా కొనసాగనుంది. మరోవైపు, గత వారం ఏఐ స్టాక్స్‌లో భారీ అమ్మకాలతో కుదేలైన మార్కెట్లకు హువాంగ్ రీఎంట్రీ ఊరటనిచ్చింది. ఎన్విడియా షేర్లతో పాటు నాస్‌డాక్ వంటి ప్రధాన సూచీలు కూడా భారీ లాభాల్లోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement