టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటాతో పాటు నెలవారీ, వార్షిక ప్లాన్లు, తక్కువ ధరలో డేటా యాడ్‌ఆన్ ప్యాక్‌లను అందిస్తోంది. కంపెనీ పదేళ్ల వేడుకల్లో భాగంగా ఈ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.
రూ.399 ప్లాన్
ఈ కొత్త ఆఫర్లలో రూ.399 ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. వీటితో పాటు 12 నెలల కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్ (రూ.4,000 విలువైన), జియోహాట్‌స్టార్ మొబైల్, జియోటీవీ ద్వారా హాలీవుడ్ కంటెంట్, ఫ్యాన్‌కోడ్, జియోగేమ్స్ సేవలను ఉచితంగా పొందవచ్చు. అలాగే 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
రూ.3,999 ప్లాన్
దీర్ఘకాలిక ప్లాన్ కోరుకునేవారి కోసం రూ.3,999 వార్షిక రీఛార్జ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత 4జీ, 5జీ డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ (రూ.1,590 విలువైన), జియోహాట్‌స్టార్ మొబైల్, ఫ్యాన్‌కోడ్, 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.15 నుంచే అన్‌లిమిటెడ్ 5జీ డేటా
అదనపు డేటా అవసరమయ్యే వారి కోసం రూ.15, రూ.25 ధరల్లో రెండు యాడ్‌ఆన్ ప్యాక్‌లను కూడా జియో తీసుకొచ్చింది. వీటి ద్వారా వరుసగా ఒక రోజు, రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చు. ఇక రూ.50తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన నైట్ డేటా ప్యాక్‌ను అందిస్తోంది. ఇందులో ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అపరిమిత 4జీ, 5జీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా సాధారణ రోజువారీ డేటా పరిమితికి అదనంగా లభిస్తుంది.
విద్యార్థులు, గేమర్లు, రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు, ఎక్కువగా వీడియోలు చూసేవారికి ఈ నైట్ డేటా ప్యాక్ ఉపయోగపడనుంది. వినియోగదారులకు డేటాతో పాటు వినోదం, గేమింగ్, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ సేవలను ఒకే రీఛార్జ్‌లో అందించడమే లక్ష్యంగా జియో ఈ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.


