జియో బంపర్ ప్లాన్‌.. 72 రోజులు ‘అదనపు బెనిఫిట్స్‌’! | Reliance Jio recharge plan 72-day 164 GB data JioHotstar Canva benefits | Sakshi
Sakshi News home page

జియో బంపర్ ప్లాన్‌.. 72 రోజులు ‘అదనపు బెనిఫిట్స్‌’!

Nov 16 2026 9:35 PM | Updated on Nov 16 2026 9:36 PM

Reliance Jio recharge plan 72-day 164 GB data JioHotstar Canva benefits

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ.749తో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అదనంగా 20 జీబీ డేటా లభిస్తుంది. దీంతో మొత్తంగా 164 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులు.

అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన వినియోగదారులు 5జీ స్మార్ట్‌ఫోన్ ద్వారా అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. రోజువారీ హైస్పీడ్ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు కూడా..

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అదనపు డిజిటల్ ప్రయోజనాలనూ జియో అందిస్తోంది. జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, డిజైనింగ్ సేవల కోసం కాన్వా ప్రో లైట్ 12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. వీటితోపాటు జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ స్టోరేజ్ సదుపాయం కూడా ఉంది.

ఇదీ చదవండి: ఒకేసారి 3 ఏళ్ల రీచార్జ్‌ ప్లాన్‌.. జియో సెన్సేషన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement