రోజూ ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించేవారిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో రూ.1,199 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకు 3GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తున్నాయి. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రూ.1199 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ చొప్పున, మొత్తం 252 జీబీ డేటా పొందవచ్చు. అంతే కాకుండా దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది. రోజుకు ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీంతో ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా.. దాదాపు మూడు నెలల పాటు సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇక ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్‌తో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్, 50 జీబీ జియోఏఐక్లౌడ్ ఫ్రీ స్టోరేజ్ ఉన్నాయి. అంతే కాకుండా.. రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.
రూ.1299 ప్లాన్ వివరాలు
కాగా.. రిలయన్స్ జియో రూ.1,299 ప్లాన్ కూడా అందిస్తోంది. రూ.1,199 ప్లాన్‌తో పోలిస్తే మరో రూ.100 అదనంగా చెల్లిస్తే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే.. ఇందులో రోజుకు 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఎక్కువ డేటా కావాలనుకునేవారు రూ.1,199 ప్లాన్‌ను, నెట్‌ఫ్లిక్స్ కావాలనుకునేవారు రూ.1,299 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: EPFO అలర్ట్.. నవంబర్ 15లోగా ఈ పని పూర్తి చేయాల్సిందే!


