ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF)కు సంబంధించి.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యాజమాన్యాలకు కీలక సూచన చేసింది. అక్టోబర్ 2026 నెలకు సంబంధించిన పీఎఫ్ కంట్రిబ్యూషన్లు, ఈసీఆర్ ఫైలింగ్‌ను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 12న తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అవుతాయని తెలిపింది.
ECR అంటే ఏమిటంటే..
ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్లకు సంబంధించిన వివరాలను యాజమాన్యాలు ఈపీఎఫ్ఓకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ ప్రక్రియనే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) అంటారు. ఇందులో ఉద్యోగుల వివరాలు, వారి వేతనాలు, పీఎఫ్ కింద ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసీఆర్ సమర్పించిన తర్వాత సంబంధిత పీఎఫ్ మొత్తాన్ని కూడా చెల్లించాలి.
ఈపీఎఫ్ఓ సూచనల ప్రకారం.. అక్టోబర్ నెలకు సంబంధించిన ఈసీఆర్‌ను ఫైల్ చేయడంతో పాటు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా నవంబర్ 15, 2026లోగా చెల్లించాలి. ఒకవేళ గడువు దాటితే.. నిబంధనల ప్రకారం అదనపు వడ్డీ, నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ పనిని పూర్తి చేయాలని యాజమాన్యాలకు సూచించింది.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఊహించని ట్విస్ట్.. మళ్లీ పెరిగిన రేట్లు!
అంతే కాకుండా.. ఈసీఆర్ ఫైల్ చేసే ముందు ఉద్యోగుల పేర్లు, వ్యక్తిగత వివరాలు, జీతాల సమాచారం, పీఎఫ్ లెక్కలను ఒకసారి సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వాటిని ముందుగానే సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, గడువుకు ముందే ఫైలింగ్, చెల్లింపు రెండూ పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి.
📢 नियोक्ता ध्यान दें! अक्टूबर 2026 वेतन माह का ECR और देय EPF अंशदान 15 नवंबर तक जमा करना सुनिश्चित करें। समय पर अनुपालन से कर्मचारियों के खातों में अंशदान का समय पर क्रेडिट होगा और विलंब शुल्क से भी बचाव होगा। #EPFO #EPFOWithYou #HumHainNa #ECR https://t.co/3IXT3jQJxt
— EPFO (@officialepfo) November 12, 2026


