దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ సానుకూల సంకేతాల మధ్య బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్ల మెరుపులతో భారత బెంచ్ మార్క్ సూచీలు ఎగిశాయి. సెన్సెక్స్ 510.40 పాయింట్లు లేదా 0.63 శాతం పెరిగి 82,102.85 వద్ద, నిఫ్టీ 146.8 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 25,291.10 వద్ద ముగిసింది.
మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత సూచీల్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.51 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా పెరిగాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బలహీన పనితీరు కనబరిచాయి.


