స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌.. | Stock Market Close Nov 13 Sensex snaps winning run ends lower | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌..

Nov 13 2026 3:52 PM | Updated on Nov 13 2026 3:52 PM

Stock Market Close Nov 13 Sensex snaps winning run ends lower

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్స్, రియల్టీ, మెటల్ షేర్లు ఒత్తిడితో బెంచ్ మార్క్ సూచీల మూడు రోజుల లాభాల పరంపరకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్ 318.56 పాయింట్లు లేదా 0.39 శాతం క్షీణించి 81,592.45 వద్ద, నిఫ్టీ 155.05 పాయింట్లు లేదా 0.61 శాతం క్షీణించి 25,144.30 వద్ద ముగిసింది.

శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.24 శాతం, 0.26 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ సిమెంట్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ మీడియా కాస్త తక్కువ నష్టాలతో పర్వాలేదనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement