ఏఐ టెస్టింగ్‌ సామర్థ్యాలు అంతంతే: క్వాలిజీల్‌ | Qualizeal Co FOunder Says About AI Testing Capacity | Sakshi
Sakshi News home page

ఏఐ టెస్టింగ్‌ సామర్థ్యాలు అంతంతే: క్వాలిజీల్‌

Nov 13 2026 1:51 PM | Updated on Nov 13 2026 1:51 PM

Qualizeal Co FOunder Says About AI Testing Capacity

కంపెనీలు జెన్‌ఏఐ వినియోగాన్ని వేగవంతం చేస్తున్నప్పటికీ వాటి నాణ్యత, సామర్థ్యాలను పరీక్షించే విషయంలో మాత్రం వెనకబడి ఉంటున్నాయి. టెక్నాలజీ సేవల సంస్థ క్వాలిజీల్, అడ్వైజరీ సంస్థ హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌ సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఏఐ వినియోగం, దాని సామర్థ్యాల టెస్టింగ్, కృత్రిమ మేథకు సంబంధించిన క్వాలిటీ ఇంజినీరింగ్‌ (క్యూఈ) ఏ విధంగా మారాల్సి ఉంటుంది అనే అంశాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో 101 అమెరికన్‌ దిగ్గజ టెక్నాలజీ సంస్థల ధోరణులను పరిశీలించినట్లు క్వాలిజీల్‌ సహ వ్యవస్థాపకుడు కల్యాణ్‌ కొండ విలేకరుల సమావేశంలో తెలిపారు.

దీని ప్రకారం 57 శాతం కంపెనీలు తయారీకి సంబంధించి జనరేటివ్‌ ఏఐని ఏదో ఒక రూపంలో వినియోగిస్తుండగా, 36 శాతం సంస్థలు ఏజెంటిక్‌ సిస్టమ్స్‌ను లైవ్‌లో ఉపయోగిస్తున్నట్లు నివేదికను విడుదల చేసిన సందర్భంగా వివరించారు. అయితే, 15 శాతం సంస్థలు మాత్రమే ఏఐ నాణ్యతను పరీక్షించేందుకు నిర్దిష్ట విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ ఇంజినీరింగ్‌కి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని, ఏఐ నైపుణ్యాలున్న వారిపై మరింతగా ఇన్వెస్ట్‌ చేసే ధోరణి ఉంటోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement