బీసీజీ ‘రైజింగ్ కంటెండర్స్’ జాబితాలో చోటు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి సంబంధించిన సన్నద్ధతలో ఇతర దేశాలకు భారత్ దీటుగా పోటీనిస్తోంది. ఏఐ స్పెషలిస్టులు, ఐటీ సేవల సిబ్బంది గణనీయంగా ఉండటం దేశానికి బలమైన అంశంగా నిలుస్తున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన ’రైజింగ్ కంటెండర్స్’ జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. ఏఐ వినియోగం విషయంలో సర్వసన్నద్ధత ఉన్నప్పటికీ, దాని వల్ల తీవ్ర స్థాయిలో విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న దేశాలతో బీసీజీ ఈ జాబితా రూపొందించింది.
అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా నుంచి అత్యంత ప్రతిభావంతులైన ప్రవాస భారతీయ నిపుణులు స్వదేశానికి తిరిగొస్తుండటం భారత్‌కి సానుకూలాంశంగా నివేదిక పేర్కొంది. ప్రభుత్వం .. కోటి మందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన యువ ఏఐ ఫర్ ఆల్, ఇండియాఏఐ ఉచిత ఫౌండేషనల్ కోర్సు, చిన్న పట్టణాల్లో ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ప్రొఫెషనల్ సరి్టఫికేషన్లు అందించే ఇండియా ఏఐ ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రాం మొదలైన వాటిని ప్రవేశపెట్టడం కూడా ఉపయోగకరంగా ఉంటోందని వివరించింది.
2026 ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహించడం కూడా భారత్ ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోందని నివేదిక తెలిపింది. ఇన్ఫర్మేషన్..కమ్యూనికేషన్, ఆర్థిక సేవలు, హై–టెక్ ఉత్పత్తులు మొదలైన వాటిలో ఏఐ వినియోగం అత్యధికంగా ఉండగా వ్యవసాయం, మైనింగ్‌లాంటి ప్రాథమిక రంగాల్లో అతి తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
దాదాపు ప్రతి దేశానికి ఒక ఏఐ వ్యూహం ఉన్నందున ప్రస్తుతం ఉద్దేశానికంటే వ్యూహాల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ’రైజింగ్ కంటెండర్స్’ జాబితాలో చిలీ, ఇండొనేíÙయా, లిథువేనియా, పోలాండ్, టర్కీ, వియత్నాంలాంటి దేశాలు ఉన్నాయి. ఏఐ అగ్రగాముల జాబితాలో అమెరికా, కెనడా, చైనా, జపాన్, యునైటెడ్ కింగ్‌డం మొదలైనవి ఉన్నాయి. 33 అంశాలవారీగా 75 దేశాలను మదింపు చేసిన మీదట బీసీజీ ఈ సర్వే నివేదికను తయారు చేసింది.
ఆర్థిక శక్తిగా ఏఐ..
ప్రస్తుతం కృత్రిమ మేథ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా రుజువైందని బీసీజీ తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే కంపెనీల ఆదాయాల్లో ఎంటర్‌ప్రైజ్ ఏఐపై పెట్టుబడులు రెట్టింపైనట్లు వివరించింది. వ్యయాల తగ్గుదల లేదా ఆదాయ వృద్ధి .. ఇలా ఏదో ఒక రూపంలో ఏఐతో ప్రయోజనాలు ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది సీఈవోల్లో తొమ్మిది మంది తెలిపారు. ఇప్పటికిప్పుడు ఈ ఏడాదే ఫలితాలు కనిపించనప్పటికీ ఏఐపై పెట్టుబడులు కొనసాగిస్తామని తొంభై నాలుగు శాతం మంది సీఈవోలు తెలిపారు.


