పెరిగిన వొడాఫోన్‌ ఐడియా నష్టం | Vodafone Idea 59. 2percent sequential rise in net loss to Rs 5,975 crore in Q2 | Sakshi
Sakshi News home page

పెరిగిన వొడాఫోన్‌ ఐడియా నష్టం

Nov 13 2026 12:55 AM | Updated on Nov 13 2026 12:55 AM

Vodafone Idea 59. 2percent sequential rise in net loss to Rs 5,975 crore in Q2

క్యూ2లో రూ. 5,975 కోట్లు 

ఏఆర్‌పీయూ@ రూ. 198 

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ టెలికం సేవల దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ. 451 కోట్లు పెరిగి రూ. 5,975 కోట్లను తాకింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 5,524 కోట్ల నష్టం నమోదైంది. త్రైమాసికవారీగా అంటే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)తో చూస్తే నష్టం రూ. 3,754 కోట్ల నుంచి భారీగా పెరిగింది. 

అయితే తాజా క్యూ2లో ట్రెజరీ ఆస్తుల మార్క్‌ టు మార్కెట్‌ (ఎంటుఎం) నష్టాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో వొడాఫోన్‌ గ్రూప్‌నకు చెందిన 328 కోట్ల షేర్లపై రూ. 462 కోట్ల అనుకోని నష్టం నమోదు చేసినట్లు వెల్లడించింది. గతేడాది క్యూ2లో వీటిపై రూ. 1,816 కోట్ల లాభం అందుకున్నట్లు ప్రస్తావించింది. తాజా పద్దును సర్దుబాటు చేస్తే రూ. 5,513 కోట్ల నష్టం నమోదైనట్లు తెలియజేసింది. మొత్తం ఆదాయం మాత్రం వార్షికంగా 6 శాతం బలపడి రూ. 11,884 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 11,195 కోట్ల టర్నోవర్‌ సాధించింది.  

వినియోగదారులు ప్లస్‌: ప్రస్తుత సమీక్షా కాలంలో వొడాఫోన్‌ ఐడియా ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 10 శాతం మెరుగుపడి రూ. 198కు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 180 ఏఆర్‌పీయూ సాధించింది. ఈ కాలంలో 19.44 కోట్లకు కస్టమర్ల సంఖ్య బలపడింది.  

ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 1 శాతం లాభంతో రూ. 13 వద్ద ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement