లిథియం బ్లాక్‌ మాస్‌ ఎగుమతులకు చెక్‌ | India Bans Lithium ion Battery Black Mass Exports | Sakshi
Sakshi News home page

లిథియం బ్లాక్‌ మాస్‌ ఎగుమతులకు చెక్‌

Nov 13 2026 1:26 PM | Updated on Nov 13 2026 1:33 PM

India Bans Lithium ion Battery Black Mass Exports

లిథియం అయాన్‌ బ్యాటరీ బ్లాక్‌ మాస్‌ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. తద్వారా దేశీయంగా రీసైక్లింగ్‌కు మద్దతివ్వడంతోపాటు.. కీలక మినరల్స్‌ రికవరీకి వీలు కల్పించనుంది. లిథియం అయాన్‌ బ్యాటరీలు, బ్యాటరీ తయారీ వేస్ట్‌ నుంచి పౌడర్‌ రూపంలో సేకరించే మెటీరియల్‌ పేరే బ్లాక్‌ మాస్‌. లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్‌ తదితర క్రిటికల్‌ మినరల్స్‌ వీటి నుంచి సేకరించవచ్చు.

వెరసి దేశీ రీసైక్లింగ్‌ను పటిష్టపరచడం, క్రిటికల్‌ మినరల్స్‌ రికవరీకి వీలు కల్పించే యోచనతో లిథియం అయాన్‌ బ్యాటరీ బ్లాక్‌ మాస్‌ ఎగుమతులను విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీఎఫ్‌టీ) నిషేధించినట్లు వాణిజ్య శాఖ తెలియజేసింది. దీనిపై డీజీఎఫ్‌టీ తాజాగా ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

కీలక మినరల్స్‌పై కన్ను
ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీలు, ఎనర్జీ స్టోరేజీ, ఎల్రక్టానిక్స్, రెనవబుల్‌ ఎనర్జీకి కీలక మినరల్స్‌ అవసరమ్యే సంగతి తెలిసిందే. వీటిలో పలు మినరల్స్‌ కోసం భారత్‌ దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా వీటి లభ్యతకు రీసైక్లింగ్‌ బ్యాటరీ వేస్ట్‌ వేగవంత, నిలకడైన మార్గంగా పేర్కొనవచ్చు.

నిజానికి బ్యాటరీ వేస్ట్‌ రీసైక్లింగ్, క్రిటికల్‌ మినరల్స్‌ రిఫైనింగ్‌ సామర్థ్యాలు భారీగా పెరిగాయి. అయితే ఇందుకు తగినంత ఫీడ్‌స్టాక్‌ అందుబాటులో లేకపోవడం గమనార్హం! ఎగుమతులు దేశీయంగా వీటి లభ్యతకు గండికొడుతున్నాయి. దీంతో రీసైక్లింగ్‌ కంపెనీలు మెటీరియల్‌ అవసరాలకు విదేశాలపై ఆధారపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఎగుమతులను నిషేధించడంతో దేశీయంగా తయారయ్యే బ్లాక్‌ మాస్‌ను.. ఇక్కడే రీసైకిల్, రిఫైన్‌ చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ఇది దేశీయంగా కీలక మినరల్స్‌ సరఫరాకు దన్నునివ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement