దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రియల్టీ, బ్యాంకులు, ఫైనాన్షియల్ షేర్లు పురోగమించడంతో బెంచ్ మార్క్ సూచీలు అస్థిర సెషన్ ను సానుకూలంగా ముగించాయి. సెన్సెక్స్ 31.61 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 81,911.01 వద్ద, నిఫ్టీ 44.30 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 25,299.35 వద్ద స్థిరపడ్డాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ 50లో టాప్ లూజర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.85 శాతం, 1.12 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ అత్యధికంగా 4 శాతం లాభపడగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో వైపు నిఫ్టీ ఆటో అత్యధికంగా క్షీణించింది.


