బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌! | Demand of Banking and Finance Shares | Sakshi
Sakshi News home page

బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌!

Nov 10 2026 8:04 AM | Updated on Nov 10 2026 8:04 AM

Demand of Banking and Finance Shares

ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. సెన్సెక్స్‌ 107 పాయింట్లు పెరిగి 81,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 25,045 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు దిద్దుబాటు, బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 820 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ 80,519 వద్ద కనిష్టాన్ని, 81,339 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,839-25,084 శ్రేణిలో కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 5% పతనమై 93.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • ఐటీ, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. టెలికమ్యూనికేషన్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా బీఎస్‌ఈలో ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ 3.76%, ప్రైవేట్‌ బ్యాంక్స్‌ 1.14% లాభపడ్డాయి.

  • దీపావళి బలిప్రతిపద సందర్భంగా నేడు (మంగళవారం) ఈక్విటీ, ఎఫ్‌అండ్‌ఓ, కరెన్సీ మార్కెట్లకు సెలవు.

తొమ్మిదేళ్ల తర్వాత ముహూరత్‌ ట్రేడింగ్‌లో నష్టాలు
దీపావళి సందర్భంగా ఆదివారం జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 29 పాయింట్లు నష్టపోయి 80,999 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 24,986 వద్ద నిలిచింది. తొమ్మిదేళ్ల (2017) తర్వాత ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు నష్టపోవడం ఇదే తొలిసారి. కొత్త సంవత్‌ ‘2083’కి స్వాగతం పలుకుతూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement