దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీగా ఎగిసిన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత ఇంధన ధరల తగ్గుదల, విదేశీ నిధుల అవుట్ ఫ్లోల తిరోగమనం నేపథ్యంలో లాభాలను కాస్త తగ్గించాయి. సెన్సెక్స్ 772.75 పాయింట్లు లేదా 0.95 శాతం పెరిగి 81,879.40 వద్ద, నిఫ్టీ 210.40 పాయింట్లు లేదా 0.84 శాతం పెరిగి 25,255.05 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.81 శాతం, 1.59 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ దాదాపు 3 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇదిలా ఉండగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ హెల్త్ కేర్ మాత్రం బలహీన పనితీరు కనబరిచాయి.


