న్యూఢిల్లీ: గ్లోబల్ పానీయాల దిగ్గజం కోకకోలా కంపెనీ దేశీ బాట్లింగ్ బిజినెస్ హిందుస్తాన్ కోకకోలా హోల్డింగ్స్(హెచ్‌సీసీహెచ్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
ఐపీవోలో భాగంగా విదేశీ ప్రమోటర్ కంపెనీ హిందుస్తాన్ కోకకోలా ఓవర్‌సీస్ హోల్డింగ్స్ పీటీఈ 99.75 కోట్ల ఈక్విటీ షేర్ల ను ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. దేశీ బాట్లింగ్ విభాగం హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్(హెచ్‌సీసీబీ)ను త్వరలో లిస్ట్ చేయనున్నట్లు మాతృ సంస్థ హెచ్‌సీసీహెచ్ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అతిపెద్ద కంపెనీగా..
ఆదాయంరీత్యా 2025–26లో నాన్‌ఆల్కహాలిక్ రెడీ టు డ్రింక్ పానీయాల విభాగంలో హెచ్‌సీసీహెచ్ దేశీయంగా అతిపెద్ద కంపెనీగా నిలిచినట్లు టీకేసీ నివేదిక పేర్కొంది. దేశీ కోకకోలా వ్యవస్థలో అతిపెద్ద బాట్లర్‌గానూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ కోక కోలాకు చెందిన విభిన్న పానీయాల ప్యాకేజింగ్, పంపిణీ, విక్రయాలను చేపడుతోంది. కోకకోలా ఓవర్‌సీస్ ద్వారా హెచ్‌సీసీహెచ్‌లో విదేశీ మాతృ సంస్థ కోకకోలా కంపెనీ 60 శాతం వాటాను కలిగి ఉంది.


