ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్న కార్ బ్రాండ్స్ ఇవే! | 2027 Bharat Mobility Expo Know The Participating Car Brands | Sakshi
Sakshi News home page

2027 Bharat Mobility Expo: ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్న కార్ బ్రాండ్స్ ఇవే!

Nov 12 2026 1:45 PM | Updated on Nov 12 2026 1:45 PM

2027 Bharat Mobility Expo Know The Participating Car Brands

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో నిర్వహణకు ఇంకా.. మూడు నెలల సమయం ఉంది. ఇందులోనే కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ ఈవెంట్లలో ఒకటైన ఈ కార్యక్రమం 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో.. ఢిల్లీలోని (ద్వారకలోని) యశోభూమిలో జరుగుతుంది.

ఈ ఈవెంట్‌లో పాల్గొనబోయే కంపెనీల జాబితాలో.. బీఎండబ్ల్యూ, హోండా, హ్యుందాయ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జేఎస్‌డబ్ల్యు మోటార్స్, కియా, మహీంద్రా, మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, రెనాల్ట్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్, టయోటా, విన్‌ఫాస్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లు సమాచారం. అయితే అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఆటోమొబైల్ తయారీదారులు.. ప్రస్తుతానికి తమ రాబోయే కార్ల శ్రేణి గురించి అధికారిక సమాచారం వెల్లడించనప్పటికీ, రాబోయే కార్ల గురించి కొంత సమాచారం లీక్ అయింది. మారుతి రెండవ ఈవీ (కోడ్‌నేమ్ YMC), కొత్త తరం హ్యుందాయ్ క్రెటా , ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మహీంద్రా విజన్ ఎస్, హ్యుందాయ్ నీరా , కొత్త కియా సోనెట్ , రెనాల్ట్ బిగ్‌స్టర్ , టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ , హ్యుందాయ్ చిన్న ఈవీ రెనాల్ట్ బ్రిడ్జర్ , టయోటా టైసర్ ఫేస్‌లిఫ్ట్, మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటి కార్లు కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement