మహిళల కోసం బెస్ట్ కార్లు.. తక్కువ ధరలో అదిరిపోయే మోడల్స్! | Cars For Women Commuters In India Budget Price | Sakshi
Sakshi News home page

మహిళల కోసం బెస్ట్ కార్లు.. తక్కువ ధరలో అదిరిపోయే మోడల్స్!

Nov 9 2026 12:43 PM | Updated on Nov 9 2026 1:01 PM

Cars For Women Commuters In India Budget Price

ఈ రోజుల్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తమ రోజువారీ వినియోగం కోసం కార్లను వినియోగిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగే, పార్కింగ్ చేయడానికి ఇబ్బంది లేని కారు ఉంటే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే.. కారు కొనేటప్పుడు మైలేజీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్, తేలికైన స్టీరింగ్, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా? లేదా? అనేది కూడా చూడాలి. ఈ కథనంలో తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్1
1/5

చిన్న కారు.. ఎస్‌యూవీ లుక్ కావాలనుకునేవారికి హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఎంపిక. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.80 లక్షలు. కాంపాక్ట్ సైజు కారణంగా ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు లభిస్తాయి. కొన్ని వేరియంట్లలో డ్యాష్‌క్యామ్ కూడా ఉంటుంది. మంచి విజిబిలిటీ, సౌకర్యవంతమైన క్యాబిన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్2
2/5

చిన్న కారు.. మంచి సౌకర్యాలు కోరుకునేవారికి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మంచి ఎంపిక. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.5.60 లక్షలు. నగరాల్లో రద్దీగా ఉండే రోడ్లపై కూడా వీటిని సులభంగా డ్రైవ్ చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్3
3/5

ఎస్‌యూవీ తరహా కారు కావాలనుకునేవారు.. నిస్సాన్ మాగ్నైట్‌ ఉత్తమ ఎంపిక. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఎత్తైన సీటింగ్ పొజిషన్ ఉండటంతో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఏఎంటీ, సీవీటీ గేర్‌బాక్స్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్4
4/5

మంచి మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కావాలనుకునేవారికి మారుతి స్విఫ్ట్ మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.84 లక్షలు. తక్కువ బరువు, కాంపాక్ట్ డిజైన్ కారణంగా నగర ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు. ఇందులో 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన కారు కావాలంటే దీనిని ఎంచుకోవచ్చు.

టాటా పంచ్5
5/5

భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు టాటా పంచ్‌ను ఎంచుకోవచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.75 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో పాటు ఎత్తైన సీటింగ్ ఉండటంతో డ్రైవింగ్ సౌకర్యంగా ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఈ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన బూట్ స్పేస్ కూడా ఉన్నాయి. కుటుంబంతో ప్రయాణించేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement