బంగారం ధరలు దీపావళి రాకెట్ మాదిరిగా దూసుకెళ్లి.. కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆదివారం స్థిరంగా ఉన్న పసిడి రేట్లు.. సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. పండుగ సందర్భంగా గోల్డ్ కొనుగోలు చేయాలని భావించిన వారికి ఈ పెరుగుదల కొంత నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికే పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్న వేళ.. ధరలు కూడా పైపైకి దూసుకెళ్లడం కొనుగోలుదారులకు భారంగా మారింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద చూడండి.


