ప్రముఖ వాహన తయారీ సంస్థ.. ఫోక్స్‌వ్యాగన్ తన అధికారిక భారత వెబ్‌సైట్ నుంచి టిగువాన్ ఆర్-లైన్(Volkswagen Tiguan R-Line)ను తొలగించింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ ప్రీమియం మిడ్ సైజ్ ఎస్‌యూవీను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వెబ్‌సైట్‌లో టైగన్, టెరాన్ మాత్రమే ఎస్‌యూవీలుగా మిగిలిపోయాయి. టిగువాన్ ఆర్-లైన్ ఏప్రిల్ 2025లో భారతదేశంలోకి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.11 లక్షలు.
టిగువాన్ ఆర్-లైన్ అనేది 5-సీటర్ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 201 bhp పవర్, 320 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ ఎంపికలో లభిస్తుంది. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రామాణికంగా ఉండేది.
ఇదీ చదవండి: పసిడి ధరలలో మార్పు.. పండక్కి ముందే కొత్త రేట్లు ఇలా..


