టెక్ దిగ్గజం డెల్ భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని డెల్ 14ఎస్ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.79,900గా నిర్ణయించింది. అంతేకాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.10,000 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ఈ ల్యాప్‌టాప్‌లో కోర్ 5, కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 21 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేసుకునే సామర్థ్యం ఉందని కంపెనీ వెల్లడించింది. అల్యూమినియం చాసిస్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: పసిడి ధరలలో మార్పు.. పండక్కి ముందే కొత్త రేట్లు ఇలా..


