కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా? | How to Charge Your Cell Phone Battery When There is No Electricity in Your House | Sakshi
Sakshi News home page

కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?

Sep 29 2026 6:53 PM | Updated on Sep 29 2026 7:04 PM

How to Charge Your Cell Phone Battery When There is No Electricity in Your House

మొబైల్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది లేకుంటే దాదాపు చాలామందికి రోజు గడవదు. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల.. కరెంట్ లేకపోతే ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా చాలామంది దిక్కుతోచదు. ఈ కథనంలో కరెంట్ లేకపోయినా మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవడానికి సులభమైన మార్గాలు ఏవి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

పవర్ బ్యాంక్
కరెంట్ లేని సందర్భాల్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. అయితే.. కరెంట్ ఉన్నప్పుడే పవర్ బ్యాంక్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుకుంటే, కరెంట్ పోయినప్పుడు దానితో మొబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకే ఇంట్లో ఒక పవర్ బ్యాంక్‌ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

కారును ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు
దాదాపు అన్ని కార్లలోనూ.. యూఎస్‌బీ పోర్ట్ లేదా మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. దానికి ఫోన్‌ను కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల కారులోని బ్యాటరీ అనవసరంగా ఖాళీ అవ్వదు. అవసరమైనంత సేపు మాత్రమే ఫోన్‌ను కనెక్ట్ చేసి ఉంచడం మంచిది.

ల్యాప్‌టాప్‌ ఉపయోగించండి
మన దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే దాని ద్వారా కూడా ఫోన్‌కు కొంత ఛార్జింగ్ ఇవ్వవచ్చు. ల్యాప్‌టాప్‌లో యూఎస్‌బీ పోర్ట్ ఉంటే, కేబుల్ సహాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేయవచ్చు. ఇది సాధారణ ఛార్జర్ కంటే నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. కానీ అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.

పోర్టబుల్ సోలార్ ఛార్జర్‌
గ్రిడ్ అవసరం లేని ఛార్జింగ్ ఎంపికను కోరుకునే వారికి పోర్టబుల్ సోలార్ ఛార్జర్లు కూడా మంచి ఎంపిక. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

కరెంట్ లేని సమయంలో.. ఫోన్ బ్యాటరీని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించాలి. అవసరం లేని వైఫై, బ్లూటూత్ వంటి వాటిని ఆఫ్ చేయాలి. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. వీలైనంత వరకు బ్యాటరీ పూర్తిగా అయ్యే వరకు ఉపయోగించకపోవడం మంచిది.

ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement