అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే? | Bank Holidays in October 2026 Gandhi Jayanti Dussehra Durga Puja and More Check Full List | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే?

Sep 29 2026 5:38 PM | Updated on Sep 29 2026 6:00 PM

Bank Holidays in October 2026 Gandhi Jayanti Dussehra Durga Puja and More Check Full List

అక్టోబర్ 2026లో పండుగలు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులకు పది రోజుల కంటే ఎక్కువ సెలవులు రానున్నాయి. దుర్గాపూజ, దసరా, విజయదశమి, లక్ష్మీపూజ, కర్వా చౌత్ వంటి పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. పండుగలను బట్టి ఒక్కో రాష్ట్రం, నగరంలో వేర్వేరు తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి.. బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉంటే ముందుగానేసెలవులను చెక్ చేసుకోవడం మంచిది.

సెలవుల జాబితా

  • అక్టోబర్ 2: గాంధీ జయంతి - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

  • అక్టోబర్ 10: మహాలయ అమావాస్య - బెంగళూరు, కోల్‌కతాలో సెలవు. ఇదే రోజు రెండో శనివారం.

  • అక్టోబర్ 17: మహా సప్తమి - అగర్తలలో సెలవు.

  • అక్టోబర్ 19: దుర్గాపూజ / మహాష్టమి / మహానవమి - పలు రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులకు సెలవు.

  • అక్టోబర్ 20: దసరా / విజయదశమి - అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

  • అక్టోబర్ 21: విజయదశమి / దుర్గాపూజ - అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం మొదలైన ప్రాంతాల్లో సెలవు.

  • అక్టోబర్ 22,23: దుర్గాపూజ / దసైన్ - గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.

  • అక్టోబర్ 24: నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

  • అక్టోబర్ 26: లక్ష్మీపూజ / మహర్షి వాల్మీకి జయంతి / యాక్సెసిబిలిటీ డే - కొన్ని ప్రాంతాల్లో సెలవు.

  • అక్టోబర్ 29: కర్వా చౌత్ - సిమ్లాలో బ్యాంకులకు సెలవు.

  • అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి - అహ్మదాబాద్‌లో సెలవు.

  • ఆదివారాలు: అక్టోబర్‌లో వచ్చే అన్ని ఆదివారాల్లో బ్యాంకు శాఖలు సాధారణంగా పనిచేయవు.

ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు మాత్రమే వాయిదా పడతాయి.

ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement