ఖాతాదారులకు అలర్ట్‌: 5 రోజులు బ్యాంకులు బంద్! | Bank Holidays From Sept 28 To Oct 4 SBI HDFC ICICI PNB Closed These Days | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు అలర్ట్‌: 5 రోజులు బ్యాంకులు బంద్!

Sep 27 2026 4:41 PM | Updated on Sep 27 2026 5:03 PM

Bank Holidays From Sept 28 To Oct 4 SBI HDFC ICICI PNB Closed These Days

ఈ వారం బ్యాంకులో ఏదైనా పని ఉందా?, అయితే.. ఒకసారి బ్యాంకు సెలవులు చూసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు ఐదు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె, అక్టోబర్ 2న గాంధీ జయంతి, ఆ తరువాత వచ్చే ఆదివారం కారణంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.

సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBU) ఆధ్వర్యంలో మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానం అమలుతో పాటు, ఐదు రోజుల బ్యాంకింగ్ వారం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి పలు డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

అయితే.. ఈ సమ్మె ప్రభావం అన్ని బ్యాంకులపై ఒకే విధంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. చాలా ప్రైవేట్ బ్యాంకులు ఈ మూడు రోజుల్లో సాధారణంగానే పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి బ్రాంచ్‌కు వెళ్లే ముందు మీ బ్యాంకు పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అక్టోబర్ 4 ఆదివారం. కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అంటే మొత్తం మీద వచ్చేవారంలో బ్యాంకులు పనిచేసేది కేవలం రెండు రోజులు మాత్రమే అని తెలుస్తోంది.

అయితే బ్యాంకు బ్రాంచ్ మూసి ఉంటే అన్ని బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయని కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా బ్యాంకింగ్ పనులను ఆన్‌లైన్‌లోనే చేసుకునే అవకాశం ఉంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, ఖాతాల మధ్య నగదు బదిలీ చేయడం వంటి పనులు సాధారణంగా చేసుకోవచ్చు. అలాగే ఏటీఎంలు కూడా సాధారణంగా అందుబాటులో ఉంటాయి. నగదు విత్‌డ్రా చేయడం వంటి సేవలను ఏటీఎం ద్వారా ఉపయోగించుకోవచ్చు. అయితే ఏటీఎంలో నగదు అందుబాటులో ఉండటం ఆయా బ్యాంకుల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement