రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు! | New UPI Rule for Train Tickets What Happens When Your Payment Exceeds 2000 | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!

Sep 27 2026 3:05 PM | Updated on Sep 27 2026 3:42 PM

New UPI Rule for Train Tickets What Happens When Your Payment Exceeds 2000

ట్రైన్ టికెట్‌ ఆన్‌లైన్‌లో బుక్ చేసి.. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు 2026 అక్టోబర్ 15 నుంచి ఓ కొత్త మార్పు గమనించనున్నారు. రూ.2000 కంటే ఎక్కువ విలువైన టికెట్ల విషయంలో ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూపీఐ ద్వారా ఒక వ్యక్తి, వ్యాపార సంస్థకు చెల్లింపు చేసినప్పుడు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ మర్చెంట్ లావేదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఉంటుంది. కానీ టెలికమ్యూనికేషన్లు, భీమా, రైల్వే టికెటింగ్‌ వంటి వాటిని స్పెషల్ కేటగిరీలో పెట్టారు. అందుకే.. రైల్వే టికెట్‌కు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లించినప్పుడు 0.4 శాతం కాకుండా.. ఒక్కో లావాదేవీకి కేవలం రూ.5 ఎండీఆర్ వర్తిస్తుంది.

ఉదాహరణకు.. మీరు రూ.3,000 విలువైన రైల్వే టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేశారనుకుంటే.. అప్పుడు ఎండీఆర్ రూ.5 ఉంటుంది. కానీ మీరు రూ.3005 చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. 5 రూపాయల అనేది మర్చెంట్ సైడ్ ఛార్జ్. కాబట్టి ప్రయాణికుడి నుంచి అదనంగా డబ్బు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా మర్చెంట్లను ఈ ఛార్జీని కస్టమర్లపై వేయకుండా చూసుకోవాలని సూచించాయి.

అదే విధంగా రూ.10,000 విలువైన టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేసినా ఎండీఆర్ రూ.5గానే ఉంటుంది. సాధారణ మర్చెంట్ లావాదేవీ అయితే 0.4 శాతం ప్రకారం రూ.10వేలకు 40 రూపాయలు అయ్యేది. కానీ రైల్వే టికెటింగ్‌కు ప్రత్యేక రూల్ ఉండటంతో ఇక్కడ రూ.5 మాత్రమే వర్తిస్తుంది. అయితే రూ. 2,000 వరకు ఉన్న అర్హత కలిగిన యూపీఐ లావాదేవీల మీద ఎండీఆర్ ఉండదు.

ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement