నేడు బ్యాంకులు పనిచేస్తాయి | Banks Open Fully Today Sunday | Sakshi
Sakshi News home page

నేడు బ్యాంకులు పనిచేస్తాయి

Sep 27 2026 10:00 AM | Updated on Sep 27 2026 10:00 AM

Banks Open Fully Today Sunday

నల్లగొండ టౌన్‌ : బ్యాంకులు ఆదివారం పనిచేయనున్నాయి. డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో మూడు రోజుల పాటు లావాదేవీలు స్తంభించనున్నాయి. 

సోమవారం నుంచి బుధవారం వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నెల 27న (ఆదివారం) పని చేయనున్నాయి. ఖాతాదారులు ఆదివారం బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చని ఆయా బ్యాంకుల నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement