సైబర్ మోసాలపై ఎయిర్‌టెల్ నిఘా! | Airtel Flags 98 4 Billion Spam Calls Amid Sharp Rise in Digital Fraud Cases | Sakshi
Sakshi News home page

సైబర్ మోసాలపై ఎయిర్‌టెల్ నిఘా!

Sep 26 2026 6:38 PM | Updated on Sep 26 2026 7:35 PM

Airtel Flags 98 4 Billion Spam Calls Amid Sharp Rise in Digital Fraud Cases

భారతదేశంలో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. స్పామ్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లతో పాటు నకిలీ బ్యాంక్ కాల్స్, ఓటీపీ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు వంటి మోసాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు కూడా కేవలం నెట్‌వర్క్ సేవలు అందించడమే కాకుండా, తమ కస్టమర్లను సైబర్ మోసాల నుంచి రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ తన ఏఐ ఆధారిత సేఫ్ నెట్‌వర్క్ సేవలను విస్తరిస్తోంది

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 98.4 బిలియన్ స్పామ్ కాల్స్, 4.4 బిలియన్ స్పామ్ మెసేజ్‌లను గుర్తించింది. అలాగే ఎస్ఎంఎస్లు, మెసేజింగ్ యాప్స్, ఈమెయిల్స్, బ్రౌజర్ రీడైరెక్ట్‌ల ద్వారా వచ్చే 1.62 మిలియన్లకు పైగా మాలిషియస్ లింకులను బ్లాక్ చేసినట్లు తెలిపింది.

అంతే కాకుండా .. ఓటీపీ మోసాలను గుర్తించేందుకు ఏఐ బేస్డ్ రక్షణ, నకిలీ కస్టమర్ కేర్ లేదా బ్యాంక్ కాల్స్‌ను గుర్తించడంలో సహాయపడే బిసినెస్ నేమ్ డిస్ప్లే వంటి ఫీచర్లను కూడా ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వీటి కోసం వినియోగదారులు ప్రత్యేకంగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా నెట్‌వర్క్ స్థాయిలోనే రక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement