గడ్కరీ కొత్త ప్లాన్.. రైతులకు లాభం! | Gadkari New Plan for Sugar Mills And Explain CBG Ethanol | Sakshi
Sakshi News home page

గడ్కరీ కొత్త ప్లాన్.. రైతులకు లాభం!

Sep 26 2026 3:44 PM | Updated on Sep 26 2026 4:01 PM

Gadkari New Plan for Sugar Mills And Explain CBG Ethanol

భారతదేశంలో చక్కెర పరిశ్రమ కేవలం చక్కెర ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఇతర విలువైన ఉత్పత్తుల వైపు కూడా అడుగులు వేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ముఖ్యంగా.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG), ఇథనాల్, బయో మాన్యూర్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి ఉత్పత్తుల తయారీపై చక్కెర మిల్లులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

భారత్ ఈ10 నుంచి ఈ20 పెట్రోల్ వైపు మారిన నేపథ్యంలో.. ఈ రంగంలో మరిన్ని అవకాశాలు ఏర్పడుతున్నాయని గడ్కరీ వివరించారు. ఈ20 అనేది.. పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలిపిన ఇంధనం. వ్యవసాయ రంగం నుంచి లభించే వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా దేశం దిగుమతి చేసుకునే చమురును తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కేవలం చక్కెరపై ఆధారపడొద్దు
చక్కెర మిల్లులు కేవలం చక్కెర తయారీపైన మాత్రమే ఆధారపడితే.. భవిష్యత్తులో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. కాబట్టి.. చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.

చెరకు ఉత్పత్తిలో మిగిలిపోయే బగాస్, ప్రెస్‌మడ్ వంటి వ్యర్థాలు, అలాగే.. వ్యవసాయ అవశేషాలను సీబీజీ తయారీలో ఉపయోగించవచ్చు. వీటిని వ్యర్థాలుగా పారేయడం కంటే.. ఇంధనంగా మార్చడం ద్వారా రైతులకు, చక్కెర మిల్లులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులు కొంత లాభపడే అవకాశం ఉంటుంది.

సీబీజీ అంటే ఏమిటి?
సీబీజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్. సులభంగా చెప్పాలంటే ఇది వ్యర్థాల నుంచి తయారయ్యే పునరుత్పాదక గ్యాస్. దీనిని పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వరి గడ్డి, చెరకు బగాస్, వెదురు, నాపియర్ గడ్డి, ప్రెస్‌మడ్, మున్సిపల్ ఆర్గానిక్ వ్యర్థాలు వంటి వాటిని ఉపయోగించి తయారు చేయవచ్చు. ఆ తర్వాత.. ఆ బయోగ్యాస్‌లోని మలినాలను తొలగించి, మీథేన్ శాతాన్ని పెంచి, దాన్ని కంప్రెస్ చేస్తే సీబీజీగా మారుతుంది. అంటే.. భూమి లోపల నుంచి సహజ వాయువును వెలికి తీయడానికి బదులుగా వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్‌ను తయారు చేసుకోవడం అన్నమాట.

ఇదీ చదవండి: టోల్ ప్లాజాల్లో కొత్త విధానం.. వాహనదారులకు భారీ ఊరట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement