రియల్ ఎస్టేట్‌లో ఎదగాలంటే.. కియోసాకి సూచనలు | Robert Kiyosaki Start Small Real Estate Build Wealth | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్‌లో ఎదగాలంటే.. కియోసాకి సూచనలు

Sep 26 2026 1:59 PM | Updated on Sep 26 2026 2:58 PM

Robert Kiyosaki Start Small Real Estate Build Wealth

రియల్ ఎస్టేట్‌లో భారీ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, కమర్షియల్‌ ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటుంటారని, అయితే పెద్ద డీల్‌ కోసం ఎదురుచూస్తూ ఉండటమే ఆర్థికంగా వెనుకబడటానికి కారణమవుతుందని ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి పేర్కొన్నారు. చిన్న ప్రాపర్టీతో ప్రారంభించి, దాని ద్వారా అనుభవం సంపాదించుకుంటూ క్రమంగా ఆస్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలని సూచించారు.

తాజాగా సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో కియోసాకి ఈ విషయాలను ప్రస్తావించారు. చాలామంది పెద్ద అపార్ట్‌మెంట్‌ భవనాలు, కమర్షియల్‌ ప్రాపర్టీల గురించి ఆలోచిస్తూ.. పుస్తకాలు చదవడం, వీడియోలు చూడటం, సెమినార్లకు హాజరుకావడం ద్వారా ఏళ్ల తరబడి ‘సిద్ధమవుతూనే’ ఉంటారని ఆయన అన్నారు. అదే సమయంలో మూడేళ్ల క్రితం చిన్న డ్యూప్లెక్స్‌ ప్రాపర్టీ కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పటికే నాలుగు ప్రాపర్టీలకు యజమాని అయి ఉండొచ్చని పేర్కొన్నారు.

మొదటి ఆస్తి.. నేర్చుకోవడం కోసం

తొలి ప్రాపర్టీ వెంటనే పెద్ద సంపదను అందించాల్సిన అవసరం లేదని కియోసాకి అన్నారు. అది రియల్‌ ఎస్టేట్‌ నిర్వహణపై అవగాహన కల్పించే సాధనంగా ఉపయోగపడాలని వివరించారు. చిన్న ప్రాపర్టీతో ప్రారంభిస్తే పొరపాట్ల వల్ల కలిగే నష్టం కూడా పరిమితంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్దెకు ఇచ్చిన ఇంటిని కిరాయిదారు దెబ్బతీస్తే ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ గురించి, ఏసీ వంటి పరికరాలు పాడైతే నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్‌ కేటాయింపు గురించి, నగర అధికారులు నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు ఇస్తే కొనుగోలుకు ముందు తనిఖీలు, చట్టపరమైన అంశాల పరిశీలన గురించి నేర్చుకోవచ్చని చెప్పారు.

అంతేకాకుండా, చిన్న ప్రాపర్టీ నుంచి వచ్చే నగదు ప్రవాహమే ఈ అనుభవాన్ని నేర్చుకునే ఖర్చును భరించగలదని కియోసాకి పేర్కొన్నారు. దీనికి భిన్నంగా మొదటి ప్రయత్నంలోనే భారీ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే, ఒక్క పెద్ద తప్పిదం కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా 20 యూనిట్ల భవనంలో అద్దెదారులకు సంబంధించిన సమస్యలు లేదా కొనుగోలుకు ముందు పరిశీలనలో గుర్తించని కీలక అంశాలు పెద్ద ఆర్థిక భారంగా మారవచ్చని అన్నారు.

ఇదీ చదవండి: రూ.26 లక్షలకు కొన్న ఇంటికి రూ.42 లక్షల ఆఫర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement