breaking news
Youth Finance
-
రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
మనీ మార్కెట్ ఫండ్ ఎవరికి అనుకూలం? – స్వర్ణముఖిమనీ మార్కెట్ ఫండ్ అన్నది డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఏడాది కాలంలో గడువు ముగిసే స్వల్ప కాల డెట్ ఇన్స్ట్రుమెంట్లు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్‌లేని ఊహించదగిన రాబడులను ఇవి ఇవ్వగలవు. ఇవి అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రిస్క్‌లేని, అధిక రక్షణతో కూడినవి. స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కాస్త అధిక రాబడులను ఇస్తాయి. ఎందుకంటే ఇవి వైవిధ్యమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేసుకునే వారు వీటిని పరిశీలించొచ్చు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై రాబడి కంటే అధిక రాబడిని ఇవ్వగలవు. బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ బ్యాలన్స్ ఉంచుకునే వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మొత్తం 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. మీ పెట్టుబడుల కాల వ్యవధి ఏడాది అయితే లిక్విడ్ ఫండ్స్ మంచివి. ఇవి తక్కువ రిస్క్ పథకాలు. అత్యవసర నిధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి. ఏడాది నుంచి మూడేళ్ల కాల సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న ప్రాథమిక లక్ష్యం పెట్టుబడి పరిరక్షణతోపాటు, కొంత రాబడి కోరుకోవడం. ఈ దృష్ట్యా లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.రిటైర్మెంట్ నిధి కోసం స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అనిరుధ్ భట్టాచార్యదీర్ఘకాలంలో సంపద సృష్టికి స్మాల్‌క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు దీర్ఘకాలం ఒక్కటే ప్రామాణికం కాదు. నష్ట భయాన్ని, యూనిట్ల విలువ క్షీణించినా తట్టుకునే గుండె నిబ్బరం కావాలి. ఇవి నిర్ణీత సమయాల్లో (సైకిల్స్) భారీ నష్టాలకు గురవుతుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి పనితీరు చూపిస్తూ, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు నష్టాలను చూపిస్తుంటే ఆందోళన చెందడం సహజం. అందుకనే మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15% మించి స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోకుండా ఉండడం సూచనీయం. చిన్న కంపెనీని ఎంపిక చేసుకుంటే, అది ఆ తర్వాతి కాలంలో పెద్ద కంపెనీగా మారితే, మంచి సంపద సృష్టి జరుగుతుంది. కానీ, అలా ఎంపిక చేసుకున్న ప్రతి కంపెనీ బడా కంపెనీ అవ్వాలనేమీ లేదు. సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువ. లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే మంచి వృద్ధిని చూపించగలవు.ఇదీ చదవండి: దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డుమరీ చిన్న కంపెనీలు అయితే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం దూరంగా ఉంటారు. స్మాల్‌క్యాప్ విభాగం పెద్దది. స్మాల్‌క్యాప్ విభాగంలో వివిధ పథకాల మధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కనుక సిప్ ద్వారా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ కంపెనీలకు సంబంధించి తగినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువ. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్ కంపెనీలు రిస్క్ ఎక్కువతో ఉంటాయి. చిన్న కంపెనీల్లో ఏ ధరలో ప్రవేశించారు, ఎక్కడ విక్రయించారన్నది రాబడులకు కీలకం అవుతుంది. -
34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!
దేశం వదిలి వెళ్లినవారు ఎంతో కొంత సంపాదించి కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాత తిరిగి స్వదేశానికి రావాలనుకుంటారు. 34 ఏళ్ల ఎన్ఆర్ఐ రూ.4 కోట్లు సంపాదించి భారత్‌కు తిరిగి వచ్చి త్వరగా రిటైర్ అవ్వాలని యోచిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. తన వద్ద రూ.4 కోట్లు ఉన్నాయని చెప్పారు. అందులో రూ.రెండు కోట్లు బ్యాంకు ఖాతాలో ఉందని, మరో రూ.రెండు కోట్లను రిటైర్మెంట్ కోసం పొదుపు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే సోషల్‌మీడియా వేదికగా తనకు ఎవరైనా ఆర్థిక సలహా ఇవ్వమని కోరాడు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది.పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘నేను ఇండియా వచ్చి రిటైర్ అయినా పార్ట్‌టైమ్‌గా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు నేను రిటైర్ అవ్వడం ఇష్టం లేదు. పీహెచ్డీ పూర్తికావడంతో భారత్‌లో నాకు మంచి ఉద్యోగమే వస్తుందని నమ్ముతున్నాను. నా పొదుపులో నుంచి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే మొత్తం ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ.1లక్ష-రూ.1.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. నా వద్ద ఉన్న నిధులు సరిపోతాయా? అనే అనుమానం ఉంది. ఈ ఖర్చులను పరిగణించి దయచేసి రిటైర్మెంట్ ప్రణాళికలు సూచించండి’ అని కోరాడు.ఇదీ చదవండి: 'సుకన్య సమృద్ధి' లాభదాయకమేనా?‘మీరు త్వరగా పదవీ విరమణ చేసి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే అగ్రెసివ్ పెట్టుబడులు చేయవద్దు. నిధులు సరిపోతాయనే దిగులు వద్దు. అయితే మీ బడ్జెట్ విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సుమారు 5-6% వడ్డీ సమకూరే ఎఫ్డీలో రూ.1 కోటి ఉంచండి. మీ బడ్జెట్ అంచనా నెలకు రూ.1లక్ష-రూ.1.5 లక్షలుగా ఉంది. లోయర్ టైర్ సిటీలో ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల పాటు అక్కడ ఉండండి. మరో రూ.3 కోట్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లించేలా బ్యాలెన్స్డ్ స్టాక్ మార్కెట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. కనీసం 5-6 సంవత్సరాల వరకు దీన్ని విత్‌డ్రా చేయకూడదు. దాంతో ఇది బాగా పెరుగుతుంది. మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగలదు. దాంతో నెలకు కనీసం రూ.లక్ష సమకూరుతుంది. దాంతోపాటు మీరు పెట్టిన కార్పస్‌పై ప్రభావం ఉండదు’ అని ఒక యూజర్ తెలిపారు. -
క్రెడిట్ కార్డే దిక్కు!
తక్కువ ఆదాయ వర్గాల వారికి క్రెడిట్ కార్డులు ఆధారంగా మారుతున్నాయి. రూ.50,000లోపు ఆదాయం ఉన్న వేతన జీవుల్లో 93 శాతం మంది అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నట్టు థింక్ 360.ఏఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. స్వయం ఉపాధిపై ఉన్న వారిలో 85 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్న 20,000 మంది వ్యక్తుల ఏడాది కాల ఆర్థిక తీరును అధ్యయనం చేసి థింక్ 360 ఈ వివరాలను విడుదల చేసింది.బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్/ఇప్పుడు కొని తర్వాత చెల్లించే సదుపాయం) సేవలను సైతం వీరు వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధిలోని వారిలో 18%, వేతన జీవుల్లో 15% మంది బీఎన్పీఎల్ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఆకాంక్షలుగానే ఉన్న క్రెడిట్ కార్డులు, బీఎన్‌పీఎల్ సేవలు నేడు నిపుణుల నుంచి తాత్కాలిక ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయని థింక్360 వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌దాస్ తెలిపారు. డిజిటల్ రుణాల్లో ఫిన్‌టెక్‌లు పోషిస్తున్న ముఖ్య పాత్రను కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుక్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని ఇటీవల పీడబ్ల్యూసీ అంచనా వేసింది. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. -
సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలు
దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను డిజిటల్ చెల్లింపులు సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన కూడా పెరగాల్సి ఉంది. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవి వినియోగదారులకు డిజిటల్ భద్రతను అందిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 5 జాగ్రత్తలను సూచిస్తోంది.లావాదేవీ ముందే సరిచూసుకోవడం..ఏదైనా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్‌పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నారో వారి పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. తొందరపడి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి.ఆథరైజ్డ్ యాప్‌లు, వెబ్సైట్లే వాడేలా..ఎప్పుడూ అధికారిక యాప్‌లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. తెలియని వారు, లేదా మరేదైనా వెబ్సైట్లో సూచించిన విధంగా లింకుల ద్వారా యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి లావాదేవీలు చేయవద్దు.గోప్యంగా ఓటీపీయూపీఐ పిన్ లేదా మెయిల్, ఫోన్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత గోప్యమైనవని గమనించాలి. ఈ వివరాలు బ్యాంకువారు కూడా అడగరని గుర్తించాలి. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా ఆయా వివరాలు అడిగితే స్కామర్లని వెంటనే తెలుసుకుని ఫిర్యాదు చేయాల్సి.హడావిడి పేమెంట్లు వద్దు..వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.ఇదీ చదవండి: లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?పేమెంట్ అలర్ట్‌లను ఆన్ చేసుకోవడం..మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్‌ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్‌ను సంప్రదించండి. -
ఎవరు చెప్పినా వినండి.. కానీ..
డబ్బు ఖర్చులు, పెట్టుబడులపై ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కోలా ఉంటాయి. మనకు బాగా తెలిసినవారు డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దాదాపు వాటినే మనలో చాలా మంది అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కరి భవిష్యత్తు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘డబ్బు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అంకుల్ స్మాల్ క్యాప్ షేర్లపై పెట్టుబడి పెట్టొచ్చు. క్రిప్టోనే భవిష్యత్తు అని మీ స్నేహితుడు ఎంచుకోవచ్చు. మీ పక్కింటివారు ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు. అయినంత మాత్రాన వారి నిర్ణయాలను కాపీ కొట్టాలా? కాదు కదా.. మీ పోర్ట్ ఫోలియో మీ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలను తీర్చేలా ఉండాలి. పొరుగువారిని అనుసరించి పెట్టుబడులు పెట్టకూడదు. మీ సొంత ప్రణాళికలు రూపొందించుకోండి. చాలా ఉచిత సలహాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. మీ అవసరాలకు సరిపోని వాటిని ఎంచుకోకూడదు. మీ ఆత్మీయులు చెప్పింది వినండి. కానీ మీకు నిజంగా ఏది అవసరమో అదే చేయండి’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..ప్రతి ఒక్కరికీ వారి సొంత పెట్టుబడి మార్గం ఉండాలి. కానీ చాలా మంది పక్కవారి అవసరాలను పరిగణించుకోకుండా గుడ్డిగా వారి నిర్ణయాలను అనుసరిస్తారు. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం చాలాముఖ్యం. పిల్లల చదువు కోసం మీరు పొదుపు చేయవచ్చు.. హాలిడే కోసం ప్లాన్ చేయవచ్చు.. లేదా ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేయవచ్చు. అందుకు వేరొకరిని అనుసరించకూడదని నిపుణులు చెబుతున్నారు. -
పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్‌కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్‌తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.మామకు గుడ్‌మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.బ్యాంకులో డిపార్ట్మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.ఆన్లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ బ్యాంకింగ్‌ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది. -
లార్జ్‌క్యాప్ – మిడ్‌క్యాప్‌లో ఏది మెరుగు?
నేను ప్రతి నెలా రూ.5,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలం కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏవైనా ఉన్నాయా? – వాణిమీ పెట్టుబడులకు తగినంత దీర్ఘకాలం ఉంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఈక్విటీ మార్కెట్లన్నవి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా మంచి పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌తో ఆరంభించొచ్చు. పెట్టుబడుల్లో మూడింట రెండొంతులను ఈక్విటీలకు, మిగిలిన ఒక వంతును డెట్ సాధనాలకు ఇవి కేటాయిస్తాయి. ఈక్విటీ విభాగం ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో డెట్ పెట్టుబడులు కుషన్‌గా పనిచేస్తాయి. అచ్చమైన ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు ఆటుపోట్ల ప్రభావం హైబ్రిడ్ పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.నెలకు రూ.5,000 చొప్పున 20 ఏళ్ల పాటు సిప్ చేస్తూ వెళితే 12.18 శాతం రాబడుల ఆధారంగా (గత 20 ఏళ్ల సగటు రాబడి) రూ.51.25 లక్షలు సమకూరుతుంది. పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలకు కేటాయించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్లలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడం సహజం. ఆ సమయంలో నష్టాలకు సైతం ఈక్విటీ పెట్టుబడులు అమ్మేస్తుంటారు. అలాంటి తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడుల విలువ క్షీణతను పరిమితం చేస్తాయి. మార్కెట్ల ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం ఉన్నవారు.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ను సైతం పరిశీలించొచ్చు. ఇవి లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో విభాగంలో పెట్టుబడులను మార్పులు చేర్పులు చేస్తుంటాయి. చారిత్రకంగా చూస్తే వీటి వార్షిక రాబడి గత 20 ఏళ్లలో 12.66 శాతం చొప్పున ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ కంటే కొంచెం అదనపు రాబడులను ఇవ్వగలవు.ఇదీ చదవండి: ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో వేటిని ఎంపిక చేసుకోవాలి. – అనిరుధ్దీర్ఘకాలంలో ఏ విభాగం అధిక రాబడులను ఇస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ముఖ్యంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే మార్కెట్ సైకిల్ (దిద్దుబాటు) ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తే.. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ కంపెనీలు మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ విభాగం అధిక రాబడులను ఇస్తుంటుంది. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్‌కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకం ద్వారా ఆ సైకిల్‌ను చక్కగా అధిగమించగలరు. -
లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!
డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్‌ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.Why do middle class families stay middle class? It is because they refuse to think of what will make them break out of the middle class mindset.What is the middle class mindset?It is something which stops you from dreaming of what you feel is beyond your present reach. You…— Shyam Sekhar (@shyamsek) July 4, 2025ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్‌తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్ ఫైనాన్స్‌పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్‌డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్ అనుకూలం. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ కూడా ఎక్కువ. డిపాల్ట్ రిస్క్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామిఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్ ఎర్రర్‌ను కూడా గమనించాలి.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనఒక ఇండెక్స్ ఫండ్.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్. -
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్‌ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్‌గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్‌గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు. -
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
దేశంలో అత్యధికంగా ఉపయోగించే హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారీ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటివి జరిపే వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిర్దిష్ట రకాల అధిక-విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టడం, సవరించిన రివార్డ్ పాయింట్ విధానాలు, అనేక కేటగిరీలలో ఫీజుల పరిమితి వంటివి ఈ మార్పులలో ఉన్నాయి.కొత్త మార్పులు.. ఛార్జీలుఆన్లైన్ గేమింగ్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు). రివార్డ్ పాయింట్లు లభించవు.వాలెట్ లోడింగ్: పేటీఎం (PayTM), మొబీక్విక్ (Mobikwik) వంటి డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు).యుటిలిటీ బిల్లులు: వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు (రూ.4,999 వరకు). ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఫీజు లేదు.లావాదేవీ ఫీజు పరిమితి: రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులకు గరిష్టంగా రూ.4,999 ఫీజు. ఫ్యూయల్ కోసం రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఫీజు వర్తిస్తుంది.ఇన్సూరెన్స్ లావాదేవీలు: రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ కార్డు రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్ కార్డులకు రూ.10,000, డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, బిజ్ బ్లాక్ మెటల్, కార్డులకు రూ.5,000, మిగిలిన కార్డులకు రూ.2000 నెలవారీ పరిమితి ఉంటుంది.యువ ప్రొఫెషనల్స్‌కు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కీలకంఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి. మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి. వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్‌లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్‌గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. -
40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్‌లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్‌కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది. -
బ్యాంక్ బ్యాలెన్స్.. బ్యాడ్ న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్‌పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్‌లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్‌లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్‌లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 3.25 శాతం వడ్డీని అందించేది.రాబడి పెంచుకోండి..యువత బ్యాంక్ బ్యాలెన్స్‌పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది. -
నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ డబ్బు పొదుపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన వార్షిక ఆదాయంలో 95% ఆదా చేస్తున్నట్లు చెప్పారు. తన ఆర్థిక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అక్షత్ ఎక్స్‌లోని వివరాల ప్రకారం.. తాను నెలకు కేవలం రూ.10,000 సంపాదనతో కెరియర్ ప్రారంభించారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతూ, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లో తయారు చేసిన భోజనం తింటూ నెలకు రూ.1,000-2,000 పొదుపు చేయగలిగాడు. అప్పులు చేయలేదు.. అనవసరమైన ఖర్చులు లేవు. మొదటి నుంచి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చిన్నమొత్తంలో స్థిరంగా పొదుపు చేస్తూ వచ్చారు.కొన్నేళ్ల తర్వాత రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. తర్వాత అతని పొదుపు అలవాట్లు కూడా పెరిగాయి. ఏడాదికి కనీసం రూ.20 లక్షలు పొదుపు చేస్తూ అప్పులేని జీవనం కొనసాగించారు. అందులో ఎక్కువ భాగాన్ని అధిక వృద్ధి పెట్టుబడులకు మళ్లించారు. కాలక్రమేణా ఆ పెట్టుబడులు సొంత ఆదాయాన్ని సృష్టించడం ప్రారంభించాయి. దాంతో రిటైర్మెంట్ కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేశారు.[1] When I started my career: my salary was 10K, I used to live with my parents; used a 2nd hand mobile phone. Ate home cooked meals (almost all the time). I was not married/had kids, took no debt. And, still saved 1-2K/month. [2] Fast forward a few years: I got a good…— Akshat Shrivastava (@Akshat_World) June 15, 2025ఇదీ చదవండి: ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, ప్రపంచ ప్రయాణాలు చేస్తూ ఖరీదైన నగరంలో నివసిస్తున్నప్పటికీ అక్షత్ తన పొదుపు రేటు ఇప్పటికీ 95% కొనసాగిస్తున్నారు. జీవనశైలి మారుతున్నా పొదుపు మాత్రం మరవకూడదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి తనకు మార్గనిర్దేశం చేసిన నియమాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘మీరు ఏదైనా రెండుసార్లు కొనగలిగితే తప్పా దాన్ని ఒకసారి కొనవద్దు. మీ నైపుణ్యాలు మెరుగుపడే పనికి మాత్రం ఖర్చు చేసేందుకు వెనుకాడవద్దు’ ఇది తెలిపారు. -
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్ అమౌంట్ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల కొత్త మినిమమ్ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌ను ఎస్బీఐ కార్డ్ తమ వెబ్సైట్లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్‌తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్‌కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు. -
యువతకు బెస్ట్ పెట్టుబడి మార్గాలు
పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస్మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.స్టాక్ మార్కెట్స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్టాక్స్‌లో నిర్ణీత షార్ట్టర్మ్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్‌టర్మ్‌లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్‌లు(కొన్ని స్టాక్స్ కలిపి ఉన్న ఫండ్) మార్కెట్లో నేరుగా లైవ్‌లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ వారీగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్ మేనేజర్ నిర్వహిస్తుంటారు.బాండ్స్బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?విద్య, నైపుణ్యాలువిద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్లో అంత ప్రయోజనం పొందుతారు. -
డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్‌లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్‌ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్‌ఫామ్‌లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్‌పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్‌కాస్ట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు. -
30 ఏళ్ల నాటి షేర్లు.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.రెడిట్‌లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్‌డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్‌కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్‌పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్‌కు, ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పసి మనసులకు కావాలి ఆర్థిక పాఠాలు
మనీ మేనేజ్మెంట్ ఒక కళ. జీవితంలో సరైన సమయంలో సరైన ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సబ్జెక్టును పిల్లలకు దురదృష్టవశాత్తు పాఠశాలల్లో చాలా అరుదుగా నేర్పిస్తారు. పిల్లలు కూడా మనకెందుకులే ఇప్పుడే నేర్చుకోవడం అనే ధోరణితో ఉన్నారు. కానీ అది సరికాదు. పాఠశాలల్లో వీలుకాని ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్చుకోవాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కలిగి ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్న వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.డబ్బు సంపాదనపై స్పష్టతజీవితంలో డబ్బు పాత్ర ఎమిటో వివరంగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎలా ఈ డబ్బు సంపాదిస్తారో స్పష్టత ఏర్పరుచుకోవాలి. అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారో ముందే అవగాహన కల్పించుకోవాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి.పొదుపుతో లాభాలురూపాయి ఖర్చు చేయడం మానేస్తే.. రూపాయి సంపాదించినట్లే.. ఈ సూత్రం పిల్లలు ఎప్పుడూ గుర్తించుకోవాలి. ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకోవాలి. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలు వచ్చే మనీని పొదుపు చేసి అత్యవసరమైన వస్తువులను వీరిపై ఆధారపడకుండా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాంటప్పుడు డబ్బు విలువ అర్థం అవుతుంది.పెట్టుబడులపై అవగాహనపొదుపు, ఖర్చుపై అవగాహన వచ్చాక మెల్లిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసేలా పిల్లల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ పథకాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవరుచుకోవాలి.ఆర్థిక ప్రణాళికఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో నేర్చుకోవాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలుఅప్పు గురించి తెలుసుకోవాలి..ఇంట్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాల కోసం తీసుకునే రుణాలకు సంబంధించిన వివరాలను పిల్లలు తెలుసుకోవాలి. ఎలాంటి సమయంలో అప్పు చేయాలి? అప్పు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.. అప్పు చేయకుండా ఉండాలంటే ఎలా మెదలాలి.. వంటి అంశాలను తెలుసుకోవాలి. -
చదువు కొంటున్నారా?
నాణ్యమైన విద్య.. అందని ద్రాక్ష కాదు..! ఏటేటా భారీగా పెరిగిపోతున్న ఫీజులు పాఠశాల విద్యకే రూ.లక్షలాది ఖర్చు విదేశీ విద్యకు భారీగా వెచ్చించాల్సిందే ముందస్తు ప్రణాళికతో సాధించడం సులభమే పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు–సంస్కారం. అందుకే తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించేందుకు తమ వంతు ప్రయత్నిస్తుంటారు.కానీ, నాణ్యమైన విద్య నేడు అందరికీ అందుబాటులో లేదు. పాఠశాల స్థాయి నుంచే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎల్కేజీ, యూకేజీలకు రూ.లక్షల ఫీజులు తీసుకుంటున్న పాఠశాలలు చాలానే ఉన్నాయి. ఉన్నత విద్యకు ఇంకా అధిక మొత్తమే వెచ్చించాల్సి వస్తోంది. నాణ్యమైన చదువుల కోసమని ఈ స్థాయి ఖర్చును భరించడం మధ్యతరగతి వారికి ముందస్తు ప్రణాళికతోనే సాధ్యం.గడిచిన దశాబ్ద కాలంలో స్కూలు ఫీజులు 150–200 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్, బెంగళూరులో పేరున్న పాఠశాలలు 30 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. సాధారణ ద్రవ్యోల్బణం 6 శాతమే. కానీ విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం వరకు ఉంటోంది. అంటే ఫీజులు ఏటా ఈ స్థాయిలో, ఇంతకుమించి పెరుగుతున్నాయి. దీనికి అదనంగా ట్యూషన్లు, క్రీడల్లో కోచింగ్, సంగీతం/కళలు, పుస్తకాలు, బస్సు రవాణా రూపంలో అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఐఐటీల్లోనూ నాలుగేళ్ల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాఠశాల చదువు తర్వాత ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, బిట్ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీటు రాకపోతే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా ఈ ఫీజులు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. పాఠశాల స్థాయిలో చేసే ఖర్చుకు అదనంగా.. మరోవైపు వారి ఉన్నత విద్యకోసం కావాల్సినంత సమకూర్చుకునేందు కు ప్రాధా న్యం ఇవ్వాల్సిందే. ఇందుకు ముందస్తు వ్యూహం, ప్రణాళిక తప్పకుండా అవసరం. ప్రణాళిక.. విద్యా వ్యయాలను భరించాలంటే అది ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమని సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్‡్షవర్ధన్ రుంగ్తా పేర్కొన్నారు. విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ (ఫీజులు, ఆహారం, వసతి ఇతర ఖర్చులు) కోసం ప్రస్తుతం 1,00,000 డాలర్లు (సుమారు రూ.86 లక్షలు) అవుతున్నట్టు చెప్పారు. దేశాలను బట్టి ఈ వ్యయాలు మారిపోతాయన్నారు. సింగపూర్‌తో పోల్చి చూసినప్పుడు యూఎస్, కెనడాలో అధిక చార్జీలు ఉన్నట్టు తెలిపారు. పిల్లల వయసు ఏడాది, ఆలోపు ఉన్నప్పుడే పెట్టుబడుల ప్రణాళిక ఆరంభించాలని సూచించారు. ప్రైవేటు విద్యా వ్యయాలు పెరిగిపోతున్న తీరు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో స్కూల్ ఫీజులు 150 శాతానికి పైనే పెరగ్గా, కొన్ని యూనివర్సిటీల్లోనూ 200 శాతం మేర ఫీజులు పెరిగాయి. నాణ్యమైన విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ఫీజులు సూచిస్తున్నాయి’’ అని వివరించారు. పిల్లలు ప్రీ స్కూల్ దశకు రాకముందే ప్రణాళిక మొదలు పెట్టాలని సూచించారు. ముందస్తుగా ఆరంభిస్తే కాంపౌండింగ్‌తో పెట్టుబడి మెరుగైన వృద్ధిని చూస్తుంది. కాల వ్యవధి.. పిల్లల వయసు ప్రస్తుతం ఎంత? పాఠశాల విద్య, ఉన్నత విద్య కోసం ఎంత సమకూర్చుకోవాలన్న విషయాలపై స్పష్టత అవసరం. చిన్నారి వయసు మూడేళ్లు ఉందనుకుందాం. ఇక్కడి నుంచి కాలేజీ చదువులకు ఇంకా 15 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఉన్నత విద్య కోసం కావాల్సినంత సమకూర్చుకునేందుకు 15 ఏళ్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే సమయంలో ఇక్కడి నుంచి ప్లస్2 వరకు (ఇంటర్) అయ్యే ఖర్చులకూ సన్నద్ధత, ప్రణాళిక వేరుగా ఉండాలి. స్కూల్ ఫీజులే కాకుండా, వారికి ఇతర విభాగాల్లో తరీ్ఫదు ఇప్పించాలనుకుంటే అందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖర్చుకు సన్నద్ధత విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం చొప్పున ఉంటోంది. కనీసం 10 శాతాన్ని అంచనా కింద తీసుకుని చూసినా.. ఐఐటీల్లో బీటెక్ కోసం నాలుగేళ్లకు నేడు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంటే.. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.30 లక్షలకు చేరుతుంది. ఇంకాస్త అదనంగా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటి వరకు మీకున్న పొదుపు పెట్టుబడులను ఒకసారి పరిశీలించండి. అవి కాకుండా, అదనంగా ఎంత సమకూర్చుకోవాలో స్పష్టతకు రావాలి. పిల్లల విద్యకు ఇప్పటి నుంచి ఎన్నేళ్లకు, ఎంత మొత్తం కావాలన్న అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ మొత్తం సమకూర్చుకునేందుకు పెట్టుబడుల ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడులకు కావాల్సినంత మిగులు లేకపోతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి.సరైన సాధనాలు.. ఇక్కడి నుంచి ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు, పద్దెనిమిదేళ్ల కాలంలో ఎంత మొత్తం కావాలన్న అంచనాకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెట్టాలి. అంత మొత్తం సమకూర్చునేందుకు వైవిధ్యమైన పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడిపై రాబడి ద్రవ్యోల్బణాన్ని మించేలా చూసుకున్నప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైనవి. 10 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో ఇవి 12–15 శాతం స్థాయిలో వార్షిక రాబడులను ఇవ్వగలవు.అదే సమయంలో పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించకూడదు. దీనివల్ల ఆటుపోట్ల రిస్క్ పెరుగుతుంది. డెట్ సాధనాలకూ నిరీ్ణత శాతాన్ని కేటాయించుకోవాలి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ ఈక్విటీ, డెట్‌తోపాటు రియల్ ఎస్టేట్, బంగారం, వెండి తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ పథకం గత పదేళ్లలో ఏటా 13 శాతానికి పైనే రాబడిని ఇవ్వడం గమనార్హం. కాల వ్యవధి కనీసం 7–10 ఏళ్లు అంతకుమించి ఉంటేనే ఈక్విటీలకు కేటాయింపులు చేసుకోవాలి. లేదంటే డెట్ సాధనాలు అనుకూలం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలు ఉన్న వారు) వంటి పన్ను రహిత సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనల మేరకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాతే మిగులు నుంచే ఖర్చులకు వెళ్లాలి. తద్వారా లక్ష్య సాధన తేలిక అవుతుంది. రక్షణ కవచాలుఅనుకోని, ఊహించని ఘటనలు చోటు చేసుకుంటే పిల్లల విద్యా లక్ష్యాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించుకోవడం అవసరం. కనుక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి.. 10–20 ఏళ్లపాటు కుటుంబం జీవన అవసరాలు, పిల్లల విద్యా వ్యయాలు, వారి వివాహం ఖర్చులు, రుణాలు ఏవైనా ఉంటే అంత మేర సమ్ అష్యూర్డ్‌తో జీవిత బీమా తీసుకోవాలి. ఇందుకు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్‌తోపాటు.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించొచ్చు.సమీక్ష అవసరం.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా.. అవి అనుకున్న విధంగానే రాబడులను ఇస్తున్నాయా? అన్నది ఏడాదికోసారి నిపుణుల సాయంతో సమీక్షించుకోవాలి. తక్కువ రాబడి ఇస్తుంటే ఇతర సాధనాల్లోకి మారిపోవడం లేదంటే.. పెట్టుబడిని పెంచుకోవడం చేయాలి. అలాగే, అంచనాలకు మించి విద్యా వ్యయాలు పెరుగుతున్నా కూడా పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిందే. కనుక పెరిగే సంపాదనకు అనుగుణంగా ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అనుకు న్న మేర రాబడులను ఇవ్వకపోవచ్చు. లేదంటే అంచనాలకు మించి ఫీజులు పెరిగిపోవచ్చు. మొత్తం మీద నిరీ్ణ త కాలానికి కావాల్సినంత సమకూరకపోతే అప్పుడు ఉన్నత విద్య కోసం విద్యా రుణాలను ఆశ్రయించడం ఒక మార్గం. కోర్సు పూర్తయిన అనంతరం లేదా ఉద్యోగంలో చేరిన అనంతరం చెల్లింపులు మొదలయ్యే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయపన్ను పాత విధానంలో విద్యా రుణాలపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తానికీ పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. స్కాలర్షిప్లు భారంగా మారిన విద్యా వ్యయా లను గట్టెక్కేందుకు స్కాలర్షిప్లు కూడా ఒక మార్గం. పేరొందిన సంస్థలు ఏటా నిరీ్ణత సంఖ్యలో విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తుంటాయి. వీటిని సాధించేందుకు ప్రయత్నించాలి. నిపుణుల సాయం పిల్లల విద్యా వ్యయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం, పెట్టుబడి సాధనాల ఎంపిక అన్నవి చాలా సంక్లిష్టమైనవి. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం వల్ల అనవసర ఆందోళన, గందరగోళాన్ని నివారించొచ్చు. అంతేకాదు, మెరుగైన సాధనాల ఎంపిక సాధ్యపడుతుంది. కొంత ఫీజుకు వెనుకాడకుండా వారి సాయాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ఎంతో ముఖ్యమైన విద్యా లక్ష్యాలను సాఫీగా అధిగమించొచ్చు.‘నా చిన్నారిని ఖరీదైన ప్రైవేటు స్కూల్‌కు పంపించను’ఫీజుల పెంపు చేయి దాటిపోతోంది. కొన్ని హైదరాబాదీ స్కూల్స్ ఈ ఏడాది 30% వరకు ఫీజులు పెంచేశాయి! → వార్షిక సగటు ఫీజులు ఇప్పుడు రూ. 60,000–2,00,000 మధ్య ఉన్నాయి. → ఏడాది ఫీజు అంతా ముందే చెల్లించాలని కొన్ని స్కూల్స్ డిమాండ్ చేస్తున్నాయి. → ఒక స్కూల్ ఎల్కేజీకి రూ.4 లక్షలు చార్జ్ చేస్తోంది. → విద్యా ద్రవ్యోల్బణం 12 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ధరలతో మనం పిల్లలను స్కూల్‌కు పంపేందుకు సన్నద్ధం చేస్తున్నామా.. లేక తల్లిదండ్రులను దివాలా బాట పట్టిస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ నేడు విద్యా సంస్థల కంటే కూడా స్టార్టప్‌ల మాదిరిగా కనిపిస్తున్నాయి’’ – ఫైనాన్షియల్ అడ్వైజర్, మాజీ వెల్త్ మేనేజర్ (ఐఐఎఫ్ఎల్) నేహ నగర్ లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ ఇది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..
సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్‌ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్ స్కోర్‌ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.జాబ్ అప్లికేషన్‌పై క్రెడిట్ స్కోర్ ప్రభావంక్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.👉ఇదీ చదవండి: టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్‌ను షేర్ చేయాలని కంపెనీలు అడగవచ్చు. -
టీనేజ్ అప్పులు.. తీరని తిప్పలు!
దేశంలో టీనేజర్లు అప్పులు చేస్తున్న ధోరణి ఇటీవల పెరుగుతోంది. భారత యువత ముఖ్యంగా టీనేజర్లు అప్పుల కోసం డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్రెడిట్ కార్డులు, ఇతర అనధికారిక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. రుణ ప్రాప్యత ఆర్థిక సౌలభ్యాన్ని అందించినప్పటికీ, ఆర్థిక అవగాహన అంతగా లేని యువ రుణగ్రహీతలకు ముప్పును కూడా కలిగిస్తుంది.పైసాబజార్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మూడు తరాలలో మొదటిసారి అప్పు తీసుకునే సగటు వయస్సు 21 సంవత్సరాలకు తగ్గింది. చాలా ఆలస్యంగా రుణాలు తీసుకోవడం ప్రారంభించిన మునుపటి తరాలతో పోలిస్తే, నేటి యువత ఇప్పుడు వారి క్రెడిట్ ప్రయాణాలను 20 ల మధ్యలో ప్రారంభిస్తున్నారు. "బై నౌ, పే లేటర్" వంటి పథకాలు, స్వల్పకాలిక వ్యక్తిగత రుణాలు పెరగడం వల్ల రుణాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏదేమైనా, భారతీయ యువతలో ఆర్థిక అవగాహన తక్కువగా ఉంది, రుణ నిర్వహణపై చాలా మందికి ఆచరణాత్మక పరిజ్ఞానం లేదు.రిస్క్‌లు, పర్యవసానాలురుణ ఉచ్చులు: అధిక వడ్డీ రేట్లు, దాచిన రుసుములు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి.ఆర్థిక ఒత్తిడి: పేలవమైన ఆర్థిక ప్రణాళిక, అధిక రుణాలు ఆందోళనకు కారణమవుతాయి. మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి.క్రెడిట్ స్కోర్ డ్యామేజ్: తప్పిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్లను దెబ్బతీస్తాయి. ఇది భవిష్యత్తు ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది.మితిమీరిన రుణాలు: అనియంత్రిత రుణాలు వ్యక్తులకు, ఆర్థిక పరిశ్రమకు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.బాధ్యతాయుతమైన రుణం.. జాగ్రత్తలుఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: బాధ్యతాయుతమైన రుణాలు, ఆర్థిక నిర్వహణపై పాఠశాలలు, తల్లిదండ్రులు టీనేజర్లకు అవగాహన కల్పించాలి.బడ్జెట్ నైపుణ్యాలు: ఖర్చులను ట్రాక్ చేయడానికి, వాస్తవిక తిరిగి చెల్లించే ప్రణాళికలను సెట్ చేయడానికి యువ రుణగ్రహీతలను ప్రోత్సహించడం.రుణ నిబంధనలను అర్థం చేసుకోవడం: రుణం తీసుకునే ముందు, టీనేజర్లు వడ్డీ రేట్లు, ఫీజులు, తిరిగి చెల్లించే పరిస్థితులను క్షణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి.రుణాన్ని పరిమితం చేయండి: అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోండి. ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం మానుకోండి.మార్గదర్శకత్వం పొందండి: ఆర్థిక సలహాదారులు లేదా మార్గదర్శకులను సంప్రదించడం టీనేజర్లకు సమాచారంతో కూడిన రుణ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. -
ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు. -
30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు
యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.సమస్యలు షురూ..దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.వ్యయ భారం ఇలా..కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యాఏం చేయాలంటే..కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి. -
కుర్రకారూ.. పడొద్దు బోల్తా..!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపులు భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ పేమెంట్స్ లో యూపీఐ చెల్లింపులదే ఆధిపత్యం. ముఖ్యంగా టీనేజర్లు, కుర్రకారు ఎక్కువగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దాదాపు అందరికీ యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసు. కానీ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. ఆన్లైన్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకునే మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.తాజా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ప్రకారం, 15-29 సంవత్సరాల వయసువారిలో దాదాపు 99.5 శాతం మందికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇది డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, స్కామర్లు సైతం తమ వ్యూహాలను అమాయక యూజర్లను మోసం చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.యూపీఐ లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?మోసాన్ని నివారించడానికి వినియోగదారులు ఈ భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.యూపీఐ పిన్ షేర్ చేయకండి: సైబర్ నేరగాళ్లు తరచూ బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ వినియోగదారులను మోసం చేస్తుంటారు.లావాదేవీ లింక్‌లను సరిచూసుకోండి: స్కామర్లు చట్టబద్ధమైన ప్లాట్ ఫారమ్ లను అనుకరించే నకిలీ యూపీఐ చెల్లింపు లింక్ లను పంపవచ్చు. లావాదేవీలను ఆమోదించడానికి ముందు ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయండి.పేమెంట్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్త: తెలియని వ్యక్తుల నుంచి పేమెంట్ రిక్వెస్ట్‌లు వచ్చినప్పుడు వాటికి స్పందించే ముందు సోర్స్‌ను చెక్ చేసుకోండి.అధికారిక యాప్‌లు, ప్లాట్ ఫామ్ ఉపయోగించొద్దు: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి ధ్రువీకరించిన బ్యాంకింగ్ లేదా పేమెంట్ యాప్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరిగేలా చూసుకోండి.అకౌంట్లో ఏం జరుగుతోందో చూసుకోండి: యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయడం అనధికార చెల్లింపులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. -
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మంది యువకుల కల. కానీ సమర్థమైన డబ్బు నిర్వహణ అలవాట్లు కొరవడడంతో సంపాదన మొదలుపెట్టిన ప్రాథమిక దశలోనే యువతకు ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. అయితే సరైన ప్రణాళికతో ఈ ఇబ్బందులను గట్టెకవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. యువత సాధారణంగా ఎలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారో.. దాని నుంచి ఎలా బయటపడవచ్చో కింది ఏడు సమస్యలు-పరిష్కారాల ద్వారా తెలుసుకుందాం.1. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడంచాలా మంది యువతకు బడ్జెట్, రుణ నిర్వహణ, పెట్టుబడి వంటి ముఖ్యమైన ఆర్థిక నైపుణ్యాలు ఉండవు. అవకాశం ఉన్నా వాటిని నేర్చుకోవాలనే స్పృహ ఉండదు. పాఠశాలలు, కళాశాలల్లోనూ నిజ జీవితంలోని ఆర్థిక పరమైన సమస్యలపై అరుదుగా బోధిస్తారు. దానికితోడు యువత స్థిరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతుంది.పరిష్కారం: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వివిధ మాధ్యమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి... వంటి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకొని ప్రాథమికంగా అందులోని అంశాలను నేర్చుకోవాలి.2. అధిక వ్యయం, జీవనశైలి ద్రవ్యోల్బణంసామాజిక మాధ్యమాలతో లాభాలున్నట్లే నష్టాలున్నాయి. యువత ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల్లో తోటివారిలాగా తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి బట్టలు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు.. వంటివి కొనుగోలు చేస్తున్నారు. తోటివారి నుంచి ఏర్పడే పరోక్ష ఒత్తిడి ద్వారా శక్తికి మించి ఖర్చు చేయడానికి సోషల్ మీడియా అవకాశం కల్పిస్తుంది.ఉదా: రూ.30,000 సంపాదించే వ్యక్తి సోషల్‌మీడియా ప్రభావం ద్వారా రూ.25,000 ఖర్చు చేసే అవకాశం ఉంది. దాంతో పొదుపునకు పరిమిత అవకాశం ఉంటుంది.పరిష్కారం: 50/30/20 నియమాన్ని అనుసరించాలి. అంటే అవసరాలకు 50%, కోరికలకు 30%, పొదుపునకు 20% ఖర్చులతో బడ్జెట్ రూపొందించుకోవాలి.3. నియంత్రించలేని రుణం, క్రెడిట్ కార్డు దుర్వినియోగంక్రెడిట్ కార్డులు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి. కానీ వాటి దుర్వినియోగం అధిక వడ్డీలకు కారణం అవుతుంది. సులభంగా ఉన్నట్లు కనిపించే ‘బై నౌ, పే లేటర్ (బీఎన్‌పీఎల్)’ పథకాలు యువతను ఖర్చుల వైపు లాగేస్తున్నాయి. నెలల తరబడి చెల్లించని రూ.50,000 క్రెడిట్ కార్డు బిల్లు అధిక వడ్డీ కారణంగా రూ.70,000 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.పరిష్కారం: ప్రణాళికాబద్ధమైన ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి నెలా బిల్లులను పూర్తిగా చెల్లించాలి. అత్యవసరమైతే తప్ప బీఎన్‌పీఎల్‌కు దూరంగా ఉండాలి.4. పొదుపు చేయకపోవడంఅత్యవసర నిధి లేకుండా యువకులు వైద్య బిల్లులు, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసర ప్రయాణం వంటి ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూడ్చేందుకు చాలా మంది అప్పులు చేయడం లేదా ఖరీదైన రుణాలు తీసుకోవడం చేస్తుంటారు.పరిష్కారం: కనీసం 3-6 నెలల సరిపడా ఖర్చులను ప్రత్యేక అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని కొనుగోళ్ల కోసం అప్పుల్లో మునిగిపోవద్దు.5. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకపోవడంచాలా మంది యువత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి సంపదను పెంచే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు డబ్బును పొదుపు ఖాతాలు, ఇతర సాధానాల్లో ఉంచుతారు. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమేణా కాంపౌండింగ్ ప్రయోజనాలు తగ్గుతాయి.పరిష్కారం: దీర్ఘకాలిక వృద్ధి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించాలి. స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులను వైవిధ్యపరచాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్, రిటర్న్‌లపై స్పష్టత ఉండాలి.6. స్కామ్‌ల బారిన పడడంవేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువ పెట్టుబడిదారులు తరచుగా పోంజీ పథకాలు(మోసపూరిత స్కీమ్‌లు), క్రిప్టో స్కామ్‌లు, నకిలీ స్టాక్ చిట్కాలకు మొగ్గుచూపుతారు. సరైన పరిశోధన లేకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కోల్పోతున్నారు.పరిష్కారం: పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లను సరిచూసుకోవాలి. ఆథరైజ్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా7. పన్ను ప్రణాళికలు విస్మరించడంచాలా మంది ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పన్ను ఆదా పథకాలను ఉపయోగించకపోవడం వల్ల అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గుతుంది.పరిష్కారం: పొదుపు, పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సెక్షన్ 80 సీ ఆప్షన్లను ఉపయోగించాలి. పన్నులను కచ్చితంగా సమయానికి దాఖలు చేయాలి. -
ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.వయసు 3–5 ఏళ్లునాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.వయసు 6–13పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.టీనేజ్ (14+)క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ చదవడం లేదా యాప్‌లు, స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.షాపింగ్ వెళ్తున్నారా..వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్‌మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.ఇదీ చదవండి: బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులుపిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి. -
బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులు
చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించిన కొద్ది నెలల్లోనే బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి ‘సర్.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైఫ్ టైమ్ ఫ్రీ.. మీ శాలరీ బేస్ చేసుకుని కార్డు ఇస్తున్నాం’ అని చెబుతుంటారు. డబ్బు అవసరం లేనివారికి ఈ కార్డు ఒక వనరుగా పనిచేస్తే.. మనీ నిత్యం అవసరం ఉండేవారికి మాత్రం ఇదో సంకటంగా మారతుందనే వాదనలున్నాయి. ఏదేమైనా క్రెడిట్ కార్డు వాడుతుంటే రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ రూపంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఎలాంటి ప్లాయింట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం.క్యాష్ బ్యాక్ & రివార్డు పాయింట్లుఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ప్రైమ్ మెంబర్లకు 5% క్యాష్ బ్యాక్‌తో ఎలాంటి ఛార్జీలు లేకుండా లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డు.హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు: షాపింగ్, డైనింగ్‌పై క్యాష్ పాయింట్స్ అందిస్తుంది.ట్రావెల్ & లాంజ్ యాక్సెస్ కార్డులుహెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్: అపరిమిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, అధిక రివార్డు పాయింట్లు అందిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు: అపరిమిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు.యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు పొందవచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!ప్రీమియం, లైఫ్స్టైట్ కార్డులుహెచ్డీఎఫ్సీ గోల్డ్ క్రెడిట్ కార్డు: ఎంపిక చేసిన బ్రాండ్లపై ఐదు రేట్లు రివార్డ్ పాయింట్లు అందిస్తుంది.అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ప్రత్యేక ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ మెంబర్షిప్ పొందవచ్చు.