బెస్ట్‌ క్యాష్‌ బ్యాక్‌, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్‌ కార్డులు | Youth Finance credit card comparison for different spendings | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ క్యాష్‌ బ్యాక్‌, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్‌ కార్డులు

Jun 5 2025 2:14 PM | Updated on Jun 5 2025 2:15 PM

Youth Finance credit card comparison for different spendings

చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించిన కొద్ది నెలల్లోనే బ్యాంకు సిబ్బంది ఫోన్‌ చేసి ‘సర్.. క్రెడిట్‌ కార్డు తీసుకుంటారా? చాలా బెనిఫిట్స్‌ ఉన్నాయి. లైఫ్‌ టైమ్‌ ఫ్రీ.. మీ శాలరీ బేస్‌ చేసుకుని కార్డు ఇస్తున్నాం’ అని చెబుతుంటారు. డబ్బు అవసరం లేనివారికి ఈ కార్డు ఒక వనరుగా పనిచేస్తే.. మనీ నిత్యం అవసరం ఉండేవారికి మాత్రం ఇదో సంకటంగా మారతుందనే వాదనలున్నాయి. ఏదేమైనా క్రెడిట్‌ కార్డు వాడుతుంటే రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఎలాంటి ప్లాయింట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం.

క్యాష్ బ్యాక్ & రివార్డు పాయింట్లు

ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ప్రైమ్ మెంబర్‌లకు 5% క్యాష్ బ్యాక్‌తో ఎలాంటి ఛార్జీలు లేకుండా లైఫ్‌టైమ్‌ ఫ్రీ కార్డు.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు: షాపింగ్, డైనింగ్‌పై క్యాష్ పాయింట్స్ అందిస్తుంది.

ట్రావెల్ & లాంజ్ యాక్సెస్ కార్డులు

హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్: అపరిమిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, అధిక రివార్డు పాయింట్లు అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు: అపరిమిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్‌ ఇస్తున్నారు.

యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు పొందవచ్చు.

ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!

ప్రీమియం, లైఫ్‌స్టైట్‌ కార్డులు

హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ క్రెడిట్ కార్డు: ఎంపిక చేసిన బ్రాండ్లపై ఐదు రేట్లు రివార్డ్ పాయింట్లు అందిస్తుంది.

అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ప్రత్యేక ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ మెంబర్‌షిప్‌ పొందవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement