దీపావళి వస్తుందంటే ఉద్యోగుల్లో ఎక్కడ చూసినా బోనస్‌ల సందడి ఉంటుంది. పండుగ వేళ ఉద్యోగులకు వచ్చే బోనస్ అదనపు ఆనందాన్ని ఇస్తుంది. అయితే చేతికి అందిన ఆ మొత్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. పండుగ షాపింగ్ కోసం ఖర్చు చేయాలా? అప్పులు తీర్చాలా? అత్యవసర అవసరాల కోసం పొదుపు చేయాలా? లేక పెట్టుబడులు పెట్టాలా? ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం.. బోనస్‌ను ఒకేసారి ఖర్చు చేయకుండా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అప్పులు, భవిష్యత్తు అవసరాలను బట్టి విభజించుకోవడం మంచిది.
బోనస్‌ను ఇలా విభజించుకోవచ్చు..
ఎయిర్‌పే మనీ సీఈఓ కుమార్ బినిత్ సూచించిన 20:30:30:20 విధానం ఒక ప్రాథమిక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. దీని ప్రకారం బోనస్‌లో 20 శాతం పండుగ ఖర్చులకు, 30 శాతం అత్యవసర పొదుపులకు, మరో 30 శాతం అప్పుల చెల్లింపునకు, మిగిలిన 20 శాతం పెట్టుబడులకు కేటాయించవచ్చు. ఉదాహరణకు రూ.50,000 బోనస్ వస్తే.. రూ.10,000 పండుగ ఖర్చులకు, రూ.15,000 అత్యవసర నిధికి, రూ.15,000 అప్పుల చెల్లింపునకు, మరో రూ.10,000 పెట్టుబడులకు వినియోగించవచ్చు.
క్రెడిట్ కార్డు అప్పులుంటే తీర్చేయండి..
బోనస్‌తో పెట్టుబడులు పెట్టే ముందు క్రెడిట్ కార్డు బకాయిలు, అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు ఉంటే వాటిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రుణాలపై చెల్లించే వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో వచ్చే రాబడికి ఎలాంటి హామీ ఉండదు. కాబట్టి అధిక వడ్డీ అప్పులను కొనసాగిస్తూ పెట్టుబడులు పెట్టడం కంటే వాటిని ముందుగా క్లియర్ చేయడం ప్రయోజనకరం.
అత్యవసర నిధి తప్పనిసరి
అప్పులు తీర్చడంతోపాటు కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు నెలకు రూ.40,000 ఖర్చు చేసే వ్యక్తి రూ.1.2 లక్షల నుంచి రూ.2.4 లక్షల వరకు అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఉద్యోగ భద్రత తక్కువగా ఉన్నవారు, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారు మరింత మొత్తాన్ని కేటాయించుకోవచ్చు. ఈ డబ్బును సులభంగా ఉపసంహరించుకునే పొదుపు ఖాతా లేదా తగిన ఇతర సురక్షిత మార్గాల్లో ఉంచాలి.
పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త
అత్యవసర అవసరాలకు సరిపడా డబ్బు పక్కన పెట్టిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించాలి. స్వల్పకాలిక అవసరాలున్నవారు తక్కువ వ్యవధి డెట్ ఫండ్లను పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలున్నవారు తమ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి వ్యవధిని బట్టి ఇతర పథకాలను ఎంచుకోవచ్చు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు కావు. వాటి రాబడికి హామీ ఉండదు. వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ కారణంగా పెట్టుబడి విలువలో మార్పులు రావచ్చు.
రుణాలు లేనివారికి మరింత వెసులుబాటు

ఇప్పటికే అప్పులు తీర్చేసి, తగినంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నవారు తమ బోనస్‌లో ఎక్కువ మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు లేదా భవిష్యత్తు లక్ష్యాలకు కేటాయించవచ్చు. అవసరమైతే పండుగ వేడుకలు, షాపింగ్ కోసం కొంత ఎక్కువ ఖర్చు చేయవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే.. దీపావళి బోనస్‌ను పూర్తిగా ఖర్చు చేయడం లేదా మొత్తం పెట్టుబడి పెట్టడం రెండూ సరైన నిర్ణయాలు కాకపోవచ్చు. అప్పుల భారం, పొదుపులు, కుటుంబ అవసరాలను బట్టి ప్రణాళిక రూపొందించుకోవాలి. పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం.