ఎగుమతుల రికార్డ్‌..! | India exports jump 30 percent to 89. 99 billion in October | Sakshi
Sakshi News home page

ఎగుమతుల రికార్డ్‌..!

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

India exports jump 30 percent to 89. 99 billion in October

అక్టోబర్‌లో 89.99 బిలియన్‌ డాలర్లు; 30 శాతం జంప్‌ 

తగ్గిన వాణిజ్య లోటు; 20 బిలియన్‌ డాలర్లుగా నమోదు

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు దుమ్మురేపాయి. అక్టోబర్‌లో మొత్తం ఎగుమతుల విలువ రికార్డు స్థాయిలో 89.99 బిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 69.27 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 29.9 శాతం ఎగబాకింది. మరోపక్క, దిగుమతులు 94.42 బిలియన్‌ డాలర్ల నుంచి 110.07 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు 20.09 బిలియన్‌ డాలర్లకు తగ్గుముఖం పట్టింది.

2025 అక్టోబర్‌లో ఇది 25.15 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ‘అక్టోబర్‌లో వస్తూత్పత్తులు, సేవలు సహా మొత్తం ఎగుమతులు కొత్త రికార్డు సృష్టించాయి. నెలవారీగా చూస్తే మునుపెన్నడూ ఈ స్థాయిలో ఎగుమతులు నమోదు కాలేదు. అలాగే వస్తూత్పత్తుల ఎగుమతుల వృద్ధి కూడా ఐదేళ్ల గరిష్టాన్ని తాకింది’ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు, విభాగాల్లోనూ ఎగుమతులు పుంజుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం... అక్టోబర్‌లో వస్తూత్పత్తుల ఎగుమతులు 49.47 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 34.11 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 45.06 శాతం వృద్ధి చెందాయి. సేవల ఎగుమతుల విషయానికొస్తే... 35.17 బిలియన్‌ డాలర్ల నుంచి 40.51 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement