తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. | Telangana Investment Opportunities Minister Sridhar Babu Bharat Summit | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..

Nov 13 2026 7:39 PM | Updated on Nov 13 2026 7:41 PM

Telangana Investment Opportunities Minister Sridhar Babu Bharat Summit

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసానిచ్చారు. శుక్రవారం హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2026లో భాగంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ/ఐటీఈఎస్, మినరల్స్, ఈఎస్ డీఎం మాన్యుఫ్యాక్చరింగ్, టెలికాం, మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, అర్బన్ మొబిలిటీ, బ్యాటరీ సెల్ టెక్నాలజీ & ఎనర్జీ స్టోరేజ్, ట్రేడ్ ఫెసిలిటేషన్, సప్లై చైన్, ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్, వేస్ట్ టూ ఎనర్జీ తదితర రంగాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీల  ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వీరిలో టర్కీ, కెనడా, సౌత్ ఆఫ్రికా, యూకే, యూఎస్ఏ ప్రతినిధులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలను , వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వారికి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఎలక్ట్రానిక్స్, తయారీ, ఔషధాలు, క్లీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, టెలికాం ఇంజినీరింగ్, ఫార్మా, ఐటీ/ ఐటీఈఎస్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలమన్నారు.

రాష్ట్రంలో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడులను పరిశ్రమలుగా, పరిశ్రమలను ఉపాధి అవకాశాలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవో అజిత్ రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement