ఏకంగా ఒక కోటను సొంతం చేసుకున్న జుకర్‌బర్గ్‌ దంపతులు | Zuckerberg Priscilla Buy Rs 538 Crore Irish Castle Estate With 440 Acre Land | Sakshi
Sakshi News home page

ఏకంగా ఒక కోటను సొంతం చేసుకున్న జుకర్‌బర్గ్‌ దంపతులు

Nov 13 2026 5:23 PM | Updated on Nov 13 2026 5:23 PM

Zuckerberg Priscilla Buy Rs 538 Crore Irish Castle Estate With 440 Acre Land

మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఆగ్నేయ ఐర్లాండ్‌లోని బ్లాక్‌వాటర్ నదికి అభిముఖంగా ఉన్న 19వ శతాబ్దపు గోతిక్-శైలి (Gothic-style) కోటను కొనుగోలు చేశారు. ఇది మెటా యూరోపియన్ ప్రధాన కార్యాలయానికి 200 కిలోమీటర్ల (125 మైళ్లు) దూరంలో ఉంది.  దీని విలువ రూ. 538 కోట్లు ఉంటుందని అంచనా.

'ది ఐరిష్ టైమ్స్' నివేదిక ప్రకారం, ప్రధాన నివాసం , ఒక ఎకరం భూమి కోసం ఈ దంపతులు 51.17 మిలియన్ యూరోలు చెల్లించారు. ఈ విక్రయం ఆగస్టు 17, 2026న ఐర్లాండ్ ప్రాపర్టీ ప్రైస్ రిజిస్టర్‌లో నమోదైంది. దీని విలువ సుమారు 57 మిలియన్ డాలర్లు (రూ. 537.37 కోట్లు). అయితే, ఈ మొత్తంలో మొత్తం 440 ఎకరాల భూమి విలువను కలపలేదు. దీన్ని బట్టి  పూర్తి ఎస్టేట్ కోసం చెల్లించిన మొత్తం ఇంకా ఎక్కువే  కావచ్చు.  కాగా జుకర్‌బర్గ్‌  పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద ఆస్తి  387 అడుగుల ప్రత్యేక మోటార్ యాచ్ 'లాంచ్‌ప్యాడ్' (Launchpad). 2024లో సుమారు 300 మిలియన్ డాలర్లు. అంటే  సుమారు  రూ.2,500 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి: హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా?

ఐర్లాండ్‌లోని కౌంటీ వాటర్‌ఫోర్డ్‌లో ఉన్న స్ట్రాంకల్లీ కాజిల్ (Strancally Castle) కొనుగోలుతో ఈ దంపతులు తమ ఆస్తుల జాబితాలో ఒక చారిత్రాత్మక ఎస్టేట్‌ను చేర్చుకున్నారు. సుమారు 440 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ  స్ట్రాన్‌కల్లీ కోట సుమారు 1830లో నిర్మించారు. అయితే 2003లో దాన్ని బాగా రెన్నోవేట్‌ చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు జాన్ కీలీ (John Keily) కోసం జేమ్స్ , జార్జ్ రిచర్డ్ పెయిన్ అనే ఆర్కిటెక్ట్‌లు దీన్ని రూపొందించారు. ఇప్పటిదాకా ఈ కోట యజమానులుగా ఉన్న మైఖేల్ , గియాంకార్లా అలెన్-బక్లీ ఈ చారిత్రాత్మక ఆస్తిని ఎంతో శ్రద్ధతో నిర్వహించి, పునరుద్ధరించారు. మూడు అంతస్తులున్న ఈ కోట చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, విశాలమైన మైదానాలు ఉన్నాయి. 'ఐరిష్ ఫార్మర్స్ జర్నల్' ప్రకారం, బ్లాక్‌వాటర్ నది వెంబడి ఈ ఎస్టేట్‌కు ఒక ప్రైవేట్ జెట్టీ (పడవలు నిలిపే చోటు) కూడా ఉంది. ఈ చారిత్రాత్మక నివాసంలొ సమయం గడపడానికి జుకర్‌బర్గ్ కుటుంబం ఎంతో ఉత్సాహంగా ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు  తెలిపారు. సానుకూల పన్ను విధానాల కారణంగా పలు అమెరికన్ టెక్ దిగ్గజాలు ఐర్లాండ్‌లో  ఆస్తులు  కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతి దిగ్గజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement