ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు సరికొత్త కొలువులు
టెక్ ప్రవేశంతో మారనున్న ఉద్యోగాల స్వరూపం
అర్హతలు, నైపుణ్యాలుంటే.. లక్షల్లోనే ప్యాకేజీలు
ఆసక్తికి ప్రాధాన్యమిస్తే మరింత రాణింపు
నూతన టెక్నాలజీతో జాబ్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి విధానాలు నిత్యం మార్పులకు లోనవుతున్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు కృత్రిమ మేథ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాలు యువతకు సరికొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ప్రమేయంతో భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం మరింతగా మారనుందని అంచనా. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో టాప్‌లో నిలిచే ఫ్యూచర్ కెరీర్స్‌పై ప్రత్యేక కథనం..
ఏఐ స్పెషలిస్ట్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారిన టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, పరిశ్రమలు, వ్యాపార సేవలు సహా అనేక రంగాల్లో ఏఐ ప్రమేయం పెరుగుతోంది. డేటాను విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించడం, పనులను వేగంగా పూర్తి చేయడంలో ఏఐ అత్యంత కీలకంగా మారింది. దీంతో భవిష్యత్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అగ్రభాగంలో నిలిచే అవకాశం ఉంది.
🔸 నైపుణ్యాలు: కంప్యూటర్ సైన్స్, ఐటీ, గణితం, స్టాటిస్టి క్స్‌పై పట్టు సాధించాలి. పలు ఉన్నత స్థాయి ఉద్యోగా లకు మాస్టర్స్ డిగ్రీతో పాటు ప్రత్యేక శిక్షణ అవసరం. పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి.
🔸 కెరీర్: టెక్నాలజీ కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఈ కామర్స్, ఆటోమొబైల్ కంపెనీలు, పరిశోధన సంస్థలతోపాటు స్టార్టప్‌లలో కెరీర్ అవకాశాలుంటాయి.
డేటా సైంటిస్ట్
నేటి డిజిటల్ యుగంలో డేటా అత్యంత కీలకంగా మారింది. కంపెనీలు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కస్టమర్ల సమాచారం, మార్కెట్ ధోరణులు, ఆన్‌లైన్ కార్యకలాపాల విశ్లేషణపై ఆధారపడుతున్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించి భవిష్యత్తు అంచనాలు రూపొందించే వారే డేటాసైంటిస్టులు.
🔸 నైపుణ్యాలు: పైథాన్, ఎస్‌క్యూఎల్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలి టీ, డేటా అనాలసిస్, మెషిన్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్–సాల్వింగ్ నైపుణ్యాలు అవసరం.
🔸 కెరీర్: టెక్నాలజీ, బ్యాంకింగ్,హెల్త్‌కేర్,రిటైల్,కన్సల్టింగ్, ఈ కామర్స్, టెలికమ్యూనికేషన్స్, ఇతర డేటా ఆధారిత కంపెనీల్లో అవకాశాలుంటాయి.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు
సంస్థల డేటాను సైబర్ దాడుల నుంచి కాపాడటం సైబర్ సెక్యూరిటీ నిపుణుల బా«ధ్యత. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ సేవలు పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు పెరుగుతోంది. తమ డేటా లీక్ కాకుండా చూసుకోవడం సంస్థలకు అత్యంత క్లిష్టంగా తయారైంది. దీంతో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
🔸 నైపుణ్యాలు: కంప్యూటర్ నెట్‌వర్కింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షన్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం.
🔸 కెరీర్: ఐటీ కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, ఈకామర్స్ కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో కెరీర్ అవకాశాలుంటాయి.
సాఫ్ట్‌వేర్ డెవలపర్
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, వ్యాపార సాఫ్ట్‌వేర్, డిజిటల్ సేవలు నేడు దైనందిన జీవితంలో భాగమయ్యాయి. దీంతో నాణ్యమైన అప్లికేషన్లను రూపొందించగల డెవలపర్ల అవసరం ఏర్పడింది.
🔸 నైపుణ్యాలు: ప్రోగ్రామింగ్, జావా, పైథాన్, సీ++, జావాస్క్రిప్ట్‌తో పాటు ప్రోగ్రామింగ్ భాషలు, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, వెబ్, మొబైల్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రోగ్రామ్–సాల్వింగ్ వంటి అంశాల్లో పట్టు సాధించాలి. ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అనుభవం పొందడం మేలు.
🔸 కెరీర్: సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్టార్టప్‌లు, బ్యాంకులు, ఈ–కామర్స్, కన్సల్టింగ్ కంపెనీలు, గేమింగ్ కంపెనీల్లో అవకాశాలుంటాయి.
రోబోటిక్స్ అండ్
ఆటోమేషన్ ఇంజనీర్
తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, లాజిస్టిక్స్, వ్యవసా యం, వైద్య, సాంకేతికత రంగాల్లో రోబోలు, ఆటోమేటెడ్ యంత్రాల వినియోగం పెరుగుతోంది. ఉత్పాదకతను పెంచడం, పునరావృత పనులను ఆటోమేట్ చేయడం, నాణ్యతను మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీ కీలకంగా మారింది.
🔸 అర్హతలు: రోబోటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణులకు అవకాశాలు.
🔸 నైపుణ్యాలు: రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, కంట్రోల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
🔸 కెరీర్: ఆటోమొబైల్ కంపెనీలు, లాజి స్టిక్స్, పరిశోధనా సంస్థలు, హెల్త్‌కేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాల్లో అవకాశాలుంటాయి.
హెల్త్‌కేర్ ఎక్స్‌పర్ట్స్
జనాభా పెరుగుదల, వృద్ధుల సంరక్షణ అవసరాలు, ఆరోగ్యంపై అవగాహన పెరగడం వంటి కారణాలతో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, వైద్య సాంకేతిక నిపుణులు, పరిశోధకులకు డిమాండ్ పెరగనుంది.
🔸 అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇతర అనుబంధ హెల్త్ కోర్సుల ఉత్తీర్ణులు
🔸 నైపుణ్యాలు: వైద్య పరిజ్ఞానంతో పాటు రోగుల పట్ల శ్రద్ధ, కమ్యూనికేషన్, బృందంగా పనిచేసే నైపుణ్యాలు అవసరం.
డిజిటల్ మార్కెటింగ్
ఈ కామర్స్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వ్యాపారాల్లో కొత్త పుంతలు. దీంతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ఆన్‌లైన్ బిజినెస్ పెంచగల, డిజిటల్ ప్రచార ఫలితాలను ట్రాక్ చేయగల నిపుణుల అవసరం నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్‌లో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈఓ), సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈ–మెయిల్ మార్కెటింగ్, పెయిడ్ అడ్వర్టయిజింగ్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఉంటాయి.
🔸 నైపుణ్యాలు: బ్యాచిలర్ డిగ్రీతోపాటు డిజిటల్ మార్కెటింగ్ రంగంపై సర్టిఫికేషన్‌లు ఉంటే ఉపయుక్తం.
🔸 కెరీర్: ప్రకటనల ఏజెన్సీలు, మీడియా కంపెనీలు, ఈ కామర్స్ వ్యాపారాలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలు, కార్పొరేట్ మార్కెటింగ్ విభాగాలలో కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: కొత్త జాబ్స్ బూమ్: ఐటీ కంటే వేగంగా నియామకాలు


