చైనా హైబ్రిడ్‌ కార్లపై ఈయూ ఆంక్షలు | EU Targets Chinese Hybrid Cars Import Limits Loom to Protect Auto Market | Sakshi
Sakshi News home page

చైనా హైబ్రిడ్‌ కార్లపై ఈయూ ఆంక్షలు

Oct 8 2026 8:44 AM | Updated on Oct 8 2026 8:44 AM

EU Targets Chinese Hybrid Cars Import Limits Loom to Protect Auto Market

వాణిజ్య లోటు తగ్గించడమే లక్ష్యం

చైనా నుంచి యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోకి పెరుగుతున్న హైబ్రిడ్‌ కార్ల దిగుమతులకు పరిమితులు విధించే దిశగా యూరోపియన్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. దిగుమతుల ఆకస్మిక పెరుగుదలతో స్థానిక ఆటో పరిశ్రమకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో తాత్కాలికంగా దిగుమతులను నియంత్రించేందుకు ఈయూ చర్యలు చేపడుతోంది. అయితే, ఈ చర్యలపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

చైనా నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇప్పటికే ఈయూ కౌంటర్‌వెయిలింగ్‌ డ్యూటీలు అమలు చేస్తోంది. ఇప్పుడు హైబ్రిడ్‌ వాహనాల దిగుమతుల పెరుగుదలపై దృష్టి సారించింది. యూరోపియన్‌ కమిషన్‌ ప్రకారం దిగుమతులు గణనీయంగా పెరిగి స్థానిక పరిశ్రమకు నష్టం కలిగినప్పుడు పరిశ్రమకు తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వడమే ఈ చర్యల ఉద్దేశం. ఇందులో భాగంగా నిర్దిష్ట పరిమాణం వరకు దిగుమతులను అనుమతించి ఆ పరిమితి దాటిన వాహనాలపై అధిక సుంకం విధించే ‘టారిఫ్‌-రేట్‌ కోటా’ విధానం ఒక ప్రత్యామ్నాయంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఇటువంటి చర్యలు అమలు కావాలంటే కఠినమైన న్యాయపరమైన ప్రమాణాలు, సభ్యదేశాల మద్దతు అవసరం.

ఇదే సమయంలో ఈయూ వాణిజ్య కమిషనర్‌ మారోస్‌ షెఫ్‌చోవిచ్‌ అక్టోబర్‌ 8–9 తేదీల్లో బీజింగ్‌లో చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌ వెంటావోతో చర్చలు జరపనున్నారు. వాణిజ్య అసమతుల్యత, మార్కెట్‌ విస్తరణ తదితర అంశాలపై జూన్‌లో ప్రారంభమైన ఈయూ–చైనా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంప్రదింపుల్లో భాగంగానే ఈ భేటీ జరుగుతోంది.

ఇదీ చదవండి: ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. లెక్కలు సున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement